Current Affairs Telugu Daily

తాత్కాలిక కార్యాలయం నుండి  కార్యకలాపాలు ప్రారంభించనున్న ‘లోక్‌పాల్‌’
భారతీయ ప్రజాస్వామ్యంలో సరికొత్త వ్యవస్థ లోక్‌పాల్‌ తాత్కాలిక కార్యాలయం నుండి  కార్యకలాపాలు  నిర్వహించనుంది
-లోక్‌పాల్‌ ఛైర్‌పర్సన్‌తో పాటు ఎనిమిది సభ్యులకు అక్కడ వేర్వేరు తాత్కాలిక కార్యాలయాలను ఏర్పాటు చేశారు.
-తొలి లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ చేత మార్చి 23న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ప్రమాణ స్వీకారం చేశారు.
-మార్చి 27న మిగతా ఎనిమిది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు(4జ్యుడిషియల్‌+ 4  నాన్‌ జ్యుడిషియల్‌)

*లోక్‌పాల్‌లో జ్యుడిషియల్‌ సభ్యులు: జస్టిస్‌ దిలీప్‌ బాబాసాహెబ్‌ భోసలే, జస్టిస్‌ ప్రదీప్‌కుమార్‌ మొహంతి, జస్టిస్‌ అభిలాష కుమారి, జస్టిస్‌ అజయ్‌కుమార్‌ త్రిపాఠీ,
*నాన్‌ జ్యుడిషియల్‌ సభ్యులు:
దినేష్‌కుమార్‌ జైన్‌, అర్చనా రామసుందరం, మహేందర్‌సింగ్‌, ఇంద్రజిత్‌ ప్రసాద్‌ గౌతం 
*జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌:
జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సభ్యుడిగా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి,ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు

లోక్ పాల్ చట్టం:
-దేశంలో ఉన్నతస్థాయిలో అవినీతిని అరికట్టేందుకు రూపొందించినదే లోక్‌పాల్‌ చట్టం. 
-పాలకులపై ప్రజలు చేసే ఫిర్యాదు ల మీద విచారణ జరుపటానికి 1809లోనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసి స్వీడన్ ప్రపంచానికి బాటవేసింది. 
-ఆ తర్వాత 130పైగా దేశాల్లో ఇలాంటి అంబుడ్స్‌ మన్ తరహా వ్యవస్థలు ఆవిర్భవించాయి. 
-మన దేశంలో కూడా ఈ తరహా వ్యవస్థ ఉండాలన్నది యాభై ఏళ్లనాటి ప్రతిపాదన. ఈ వ్యవస్థను లోక్‌పాల్‌గా వ్యవహరించాలని ప్రముఖ న్యాయకోవిదుడు ఎల్.ఎం.సింఘ్వీ మొదట సూచించారు. 
-1966లోనే మొరార్జీ నేతృత్వంలోని పరిపాలన సంస్కరణల సంఘం కేంద్రంలో లోక్‌పాల్, రాష్ర్టాల్లో లోకాయుక్త వ్యవస్థలను ఏర్పా టుచేయాలని సూచించింది. 
-తొలిసారి జన్‌లోక్‌పాల్ బిల్లును 1968లో శాంతిభూషణ్ ప్రతిపాదించారు. 1969లో లోక్‌సభ ఆమోదించింది.  కానీ రాజ్యసభ ఆమోదం పొందలేదు. 
-ఆ తర్వాత 9 సార్లు ఈ బిల్లును లోక్ సభలో పెట్టినా ఆమోదానికి నోచుకోలేదు. లోక్‌పాల్ బిల్లును ఆమోదించాలంటూ అన్నాహజారే 2011 ఏప్రిల్‌లో ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. 
-లోక్‌పాల్ బిల్లు రూపకల్పనలో సూచనలు చేసేందుకు అన్నాహజారే సహా పలువురు ప్రభుత్వ, పౌర సమాజ ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ సర్కారు నోటిఫికేషన్ విడుదల చేయటంతో హజారే దీక్ష విరమించారు. 
-2013లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం..2011 డిసెంబర్ 27న లోక్‌సభలో లోక్‌పాల్ బిల్లును ఆమోదించారు. అయితే ప్రధానమంత్రిని ఈ బిల్లు నుంచి మినహాయింపు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2012 డిసెంబర్ లో హజారే మళ్లీ దీక్షకు దిగారు. 
-దీంతో  బిల్లులో పలు సవరణలు చేసి డిసెంబర్ 18న లోక్ సభలో ఆమోదించారు. 2013లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించడంతో చట్టంగా మారింది.
*లోక్ పాల్ చట్టం పరిధిలోకి  
-ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు ఉన్నతస్థాయి కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు కూడా లోక్‌పాల్ పరిధిలోకి వస్తారు. 
-వీరిపై వచ్చే ఫిర్యాదులను లోకపాల్ పరిశీలించి విచారణ జరుపుతుంది. 
-నిబంధనల ప్రకారం లోక్‌పాల్‌లో చైర్‌పర్సన్, గరిష్ఠంగా 8 మంది సభ్యులుంటారు. 
-వీరిలో నలుగురు తప్పనిసరిగా న్యాయాధికారులై ఉండాలి. లోక్‌పాల్‌ లో సగానికి తగ్గకుండా సభ్యులు ఎస్సీ లేదా ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలు ఉండాలి.
-ఒకసారి ఎంపికైన సభ్యులు ఐదేండ్లు, 70 ఏండ్లే వచ్చే వరకు లోక్‌పాల్‌లో కొనసాగుతారు

views: 800Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams