Current Affairs Telugu Daily

పోలవరం సామర్థ్యం పెంపుతో భద్రాద్రికి ముప్పు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రవాహ సామర్థ్యం 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచితే భద్రాచలానికి ముంపు ముప్పు పొంచి ఉంటుందని నీటిపారుదల శాఖ అంతర్‌రాష్ట్ర వ్యవహారాల సీఈ నరసింహారావు పేర్కొన్నారు.
*పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణలో ముంపునకు గురయ్యే ప్రాంతాల పరిస్థితిని ఆదివారం ప్రత్యేక అధికారుల అధ్యయన బృందం పరిశీలించింది. సీఈ నరసింహారావు, ఈఈ రాంప్రసాద్‌, ఐఐటీ ప్రొఫెసర్‌ డా.శశిధర్‌ నేతృత్వంలో అధికారులు భద్రాచలంలో పరిశీలన చేపట్టారు.
మారిన పరిస్థితుల నేపథ్యంలో 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో పోలవరం నిర్మిస్తే ఆ ప్రాజెక్టు నుంచి 120 కి.మీ. మేర వెనుక జలాలు ఉంటాయని వివరించారు. ఈ 120 కి.మీ.లలో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటాయని తెలిపారు. తెలంగాణలో సుమారు 30 కి.మీ విస్తీర్ణంలో ఉంటాయన్నారు.


views: 996Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams