Current Affairs Telugu Daily

2013 నుంచి 2017 మధ్యకాలంలో దేశంలో 2కోట్లకు పైగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయలేదు: సీబీడీటీ
 * పన్నుల వసూళ్ళను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చేపడుతుండగా 2013 నుంచి 2017 మధ్యకాలంలో భారత్‌లో 2.04 కోట్ల మంది ఆదాయ పన్నుకు సంబంధించిన రిటర్నులు దాఖలు చేయలేదని, అలాగే దాఖలు చేసేవారి సంఖ్య కూడా గణనీయంగా పడిపోయిందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు(సీబీడీటీ) తాజాగా వెల్లడించింది.

​​​​​​* 2019 జూన్ 30లోగా ఐటీ రిటర్నులు దాఖలు చేయనివారిపై భారీ స్థాయిలో జరిమానా విధించాలని నిర్ణయించింది. 

* ఆగస్టు 31 నుంచి డిసెంబర్ 31లోగా ఐటీ రిటర్నులు దాఖలు చేసినవారిపై రూ.5 వేల జరిమానా, ఆ తర్వాత దాఖలు చేసిన వారిపై రూ.10 వేల వరకు జరిమానా విధించనున్నారు. 

* రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన చిన్న స్థాయి పన్ను చెల్లింపుదారులపై గరిష్ఠంగా రూ.1,000 వరకు జరిమానా వేయనున్నారు.
 
  • ఆదాయ పన్ను శ్లాబులు:
- రూ.2.5 లక్షల్లోపు - ఉండదు. 
- రూ.2.5 - 5 లక్షలు 5%
- రూ.5-10లక్షలు 20%
- రూ.10 లక్షలు మించి 30%

* వార్షిక ఆదాయం రూ.50 లక్షల్లోపు ఉన్నవారు ఎలాంటి సర్‌ఛార్జీ కట్టాల్సిన అవసరం లేదు. అదే, ఏడాదికి రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల్ని ఆర్జించేవారు. ఆదాయంలో 10 శాతం దాకా సర్‌ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

* ఆదాయం రూ.కోటి దాటితే 15 శాతంతో పాటు అదనంగా మరో మూడు శాతం ఎడ్యుకేషన్ సెస్ కూడా చెల్లించాలి.

views: 753

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams