Current Affairs Telugu Daily

జన్‌ధన్‌ ఖాతాల్లో మొత్తం సొమ్ము సుమారు లక్షకోట్ల రూపాయలు

* కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జన్‌ధన్‌ ఖాతాల్లో ఇప్పటివరకూ ఉన్న మొత్తం సొమ్ము సుమారు లక్ష కోట్ల రూపాయాలు (ఏప్రిల్‌ 3వ తేదీ 97,665.66కోట్లు) గా ప్రభుత్వం గణాంకాల ద్వారా వెల్లడించింది.

  • దీనిలో ముఖ్యంశాలు:

- జన్‌ధన్‌ ఖాతాలు సంఖ్య :  35.39కోట్లు
- రూపేకార్డుల జారీ : 27.89కోట్లు
- ఇందులో  50శాతం బ్యాంకు ఖాతాలు మహిళలవే
- మొత్తం ఖాతాల్లో 59శాతం ఖాతాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. 
- జన్‌ధన్‌ ఖాతాల్లో నగదు డిపాజిట్లు రోజురోజుకు పెరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
 

  • ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన(పీఎంజేడీవై): 

- ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉండాలన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2014 ఆగస్టు 28న ప్రారంభించింది.
- ఖాతాదారులకు ప్రమాదబీమాను రూ.లక్ష నుంచి రూ.2లక్షలకు పెంచారు.
- ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం 5000 ల నుంచి 10,000లకు పెంచారు.
- ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన యొక్క నినాదం “మేరా ఖాతా- భాగ్య విధాత”.
- సేవింగ్స్ ఖాతాధారులకు ఈ నిభందనలు వర్తించవు. కేవలం 0 బేలన్స్ ఖాతాగా ప్రారంభించుకొను వారికి మాత్రమే వర్తిస్తాయి.


views: 796



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams