Current Affairs Telugu Daily

అన్నవరం దేవస్థానానికి ఐఎస్‌వో గుర్తింపు
* తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం దేవస్థానానికి అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ఐఎస్‌వో గుర్తింపు దక్కింది.
* సత్యదేవుని ప్రసాదంతో పాటు, ఆలయంలో అందుతున్న సేవలకుగానూ 2 విభాగాల్లో ఈ గుర్తింపు లభించింది.
* హెచ్‌వైఎం ఇంటర్నేషనల్‌ సర్టిఫికెట్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఎండీ శివయ్య ధ్రువీకరణ పత్రాలను దేవస్థానం ఛైర్మన్‌ ఐ.వి.రోహిత్‌, ఈవో ఎం.వి.సురేష్‌బాబు, ధర్మకర్తల మండలి సభ్యులకు అందించారు.
* రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా సత్యదేవుని గోధుమ నూక ప్రసాదానికి ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల విభాగంలో ఐఎస్‌వో 22000 : 2005 గుర్తింపు దక్కింది.
* ఆలయంలో అందుతున్న సేవలు, పనితీరు, స్వచ్ఛతా ప్రమాణాలకు ఐఎస్‌వో 9001:2015  గుర్తింపు వచ్చింది.

views: 962Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams