Current Affairs Telugu Daily

జపాన్‌కు చెందిన అంధ సెయిలర్‌ రికార్డు
మిత్సుహిరో ఇవామొటో అనే అంధ సెయిలర్‌ రెండు నెలల పాటు ప్రయాణించి పసిఫిక్‌ను దాటారు. ఫిబ్రవరి 24న తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు. 40 అడుగుల పొడవున్న సెయిల్‌ బోట్‌లో డోగ్ స్మిత్‌ అనే యువకుడితో కలిసి కాలిఫోర్నియా నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. రెండు నెలలు ప్రయాణించి  జపాన్‌లోని ఫకూషిమా పోర్టుకు చేరుకున్నారు.
ఇలాంటి ప్రయోగమే ఇవామొటో ఇంతకు ముందు కూడా చేశారు. కానీ అప్పుడు ప్రయాణం సగభాగంలో ఉండగా తన పడవ పెద్ద తిమింగలాన్ని ఢీకొనడంతో  అది మునిగిపోయింది. అంతటితో ఆ ప్రయాణానికి ముగింపు పలికి తర్వాత ఫిబ్రవరిలో ప్రారంభించారు. దాదాపు 14,000 కి.మీ దూరం ప్రయాణించి తన లక్ష్యాన్ని చేరుకున్నారు.

views: 775

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams