Current Affairs Telugu Daily

టీమిండియా ప్లేయర్స్ పాండ్య, కేఎల్‌ రాహుల్‌కు అంబుడ్స్‌మన్‌ జరిమానా
 ‘కాఫీ విత్‌ కరణ్‌ ’ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, బ్యాట్స్‌మెన్‌ కేఎల్‌ రాహుల్‌లకు రూ.20లక్షలు జరిమానా చెల్లించాలంటూ బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ ఆదేశాలు జారీ చేశారు.
*ఇందులో అమరులైన పారామిలిటరీ దళ కానిస్టేబుళ్ల భార్యలకు 10మందికి రూ.1లక్ష చొప్పున చెల్లించాలని, మిగిలిన రూ.10లక్షలు అంధుల క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రచారఖర్చుల నిమిత్తం విరాళంగా ఇవ్వాలని సూచించారు. *ఈ మొత్తాన్ని నిర్దేశించిన నాలుగు వారాల్లోపు చెల్లించాలని, లేకపోతే మ్యాచ్‌ ఫీజుల నుంచి కట్‌ చేసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

views: 749

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams