Current Affairs Telugu Daily

రాష్ట్ర ప్రభుత్వాల బహిరంగ మార్కెట్ రుణాలపై  షరతులు విధించిన కేంద్ర ప్రభుత్వం
ఏడాదికి ఏడాదీ జాతీయ, రాష్ట్ర స్థాయిలో పెరిగిపో తున్న రుణాలపై కేంద్రం దృష్టి సారించడం లోప్రధానంగా బహిరంగ మార్కెట్‌ రుణాల పెరుగుదల భారంగా మారిందని గుర్తించింది.
*దీనితో బహిరంగ మార్కెట్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న రుణాలపై గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం దీనిపై షరతులు విధించింది
*ఆర్థిక లోటును అధిగమించడానికి ప్రతి రాష్ట్రం బహిరంగ మార్కెట్‌ నుంచి రుణాలు తీసుకోవడం కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293(3) ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకోసారి ఇందుకు అనుమతిస్తుంది.
*దీని ప్రకారం ప్రభుత్వం ఆ 3 నెలల్లో తనకు అవసరమైనప్పుడు ఒకేసారో, లేదంటే నెలకోసారో బహిరంగ మార్కెట్‌ నుంచి రుణ సేకరణ కోసం అవకాశం ఉండేది.
*కానీ తాజాగా  కేంద్రం విధించిన షరతుల ప్రకారం ఈ రుణాలను బహిరంగ మార్కెట్‌ నుంచి 3 నెలల్లో సమానంగా తీసుకోవాల ని మరియు 
ప్రతి నెలా బహిరంగ మార్కెట్‌ నుంచి రుణ సేకరణకు వెళ్లాలి తప్పితే తనకు అవసరమైనప్పుడు అవసరమైనంత మొత్తాన్ని ఒక్కసారిగా తీసుకోవడానికి వీలులేని విధంగా ఆంక్షలు విధించింది
*దీనివల్ల రాష్ట్రాల్లో కొన్ని సంక్షేమ పథకాలకు ఒకేసారి నిధులు చెల్లించాల్సి వచ్చినప్పుడు రుణసేకరణ కష్టతరం కానుంది
*బహిరంగ మార్కెట్‌ రుణాలు 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే  12 లక్షల కోట్ల రూపాయలు గా అంచనా
*జాతీయ స్థాయిలో 6.05 లక్షల కోట్లు, రాష్ట్రాల్లో 5.45 లక్షల కోట్ల రూపాయల వరకు బడ్జెట్‌ ప్రతిపాదనల్లో పొరదుపరిచారు.
*2010-11 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం 4.18 లక్షల కోట్లు రుణం తీసుకోగా అది 2018-19 నాటికి 6.05 లక్షల కోట్లకు చేరుకురది. అనగా పదేళ్లలో దాదాపు రెండు లక్షల కోట్ల మేర రుణం పెరిగింది.
*అదే రాష్ట్రాల విషయానికొస్తే 2010లో కేవలం 1.31 లక్షల కోట్లు రుణం నమోదుకాగా, ఇప్పుడు కొత్త బడ్జెట్‌లో ఏకంగా 5.45 లక్షల కోట్లుకు చేరిపోయిరది. అనగా ఏకంగా నాలుగు లక్షల కోట్లకుపైగానే అదనపు రుణం రికార్డయ్యింది. అరదుకే దీనిపై నియంత్రణ అమలు చేయాలని కేంద్రం భావించింది.

views: 826

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams