Current Affairs Telugu Daily

అబుదాబిలో తొలి హిందూ ఆలయం 
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) రాజధాని అబుదాబిలో నిర్మించనున్న తొలి హిందూ దేవాలయానికి  శంకుస్థాపన జరిగింది.
*ఆలయాన్ని నిర్మిస్తున్న బోచసన్‌వాసి శ్రీ అక్షర్‌–పురుషోత్తమ్‌ స్వామినారాయణ్‌ సంస్థ (బీఏపీఎస్‌) అధిపతి మహాంత్‌ స్వామి మహారాజ్‌ గర్భగుడి నిర్మాణం కోసం పునాదిరాయి వేశారు.
*అబుదాబి–దుబాయ్‌ హైవేకు సమీపంలో 14 ఎకరాల్లో ఏడు అంతస్తులుగా ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. ఇందులో ఆర్ట్‌ గ్యాలరీ, గ్రంథాలయం, వ్యాయామశాల ఏర్పాటు చేయనున్నారు.
*2015లో ప్రధాని మోదీ తొలి పర్యటన సందర్భంగా ఆలయ నిర్మాణ ప్రణాళికకు అబుదబీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది.
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌:
  • రాజధాని: అబూ ధాబీ
  • కరెన్సీ: United Arab Emirates dirham
  • అధ్యక్షుడు: ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్
  • భారత రాయబారి-నవ్‌దీప్‌ సూరి 

views: 802



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams