Current Affairs Telugu Daily

20వ శతాబ్దంలోనే అతిపెద్ద ప్రమాదం భోపాల్‌ గ్యాస్‌ విషాదం: ఐరాస నివేదిక
దేశంలో 1984 మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన ప్రమాదం 20వ శతాబ్దంలోనే అతి పెద్ద పారిశ్రామిక ప్రమాదమని ఐరాస నివేదిక పేర్కొంది
*ఈ భోపాల్‌ గ్యాస్‌ విషాదం  జరిగిన ప్రమాదంలో విడుదలైన 30 టన్నుల మిథేల్‌ ఐసోసైనేట్‌ వాయువు 6 లక్షల మందిని ప్రభావితం చేసిందని నివేదిక తెలిపింది. 
*ఈ నివేదిక లో భోపాల్‌ ప్రమాదం తరువాతి స్థానంలో  చెర్నోబిల్‌, ఫుకుషిమా అణు విపత్తులు, రాణ ప్లాజా భవన విధ్వంసం లు నిలిచాయి
*ఐరాస అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) నివేదికలో ముఖ్యాంశాలు:
*పని స్థలాల్లో జరిగే ప్రమాదాలు, సంబంధిత వ్యాధుల కారణంగా ఏటా 27 లక్షల మంది ప్రాణాలు కోల్పోతు న్నారు
*వ్యక్తిగత అపాయాల వల్ల పురుషుల కంటే మహిళలకే ఎక్కువ  ముప్పు పెరుగుతుంది
*36 శాతం శ్రామికులు వారానికి దాదాపు 48 గంటలపాటు అధికంగా పనిచేస్తున్నారు
  • 1984 డిసెంబరు 2న యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌ లో ఘటన జరిగింది
  • అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ 1982లో యూసీఐఎల్‌ భోపాల్ ఫ్యాక్టరీలో సర్వే నిర్వహించి పది చోట్ల లోపాలు ఉన్నట్టు గుర్తించి వెల్లడించింది
  • భోపాల్ గ్యాస్ లీకేజీ బాధితుల పునరావాస శాఖ పేరుతో మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
  • యూనియన్‌ కార్బైడ్‌ అధిపతి వారెన్‌ అండర్సన్‌
  • 2004లో ప్రతిష్ఠాత్మక గోల్డ్‌మేన్‌ పర్యావరణ బహుమతి పొందిన చంపాదేవితో కలిసి రషీదా బీ ఈ పిల్లల కోసం ఇక్కడ చింగారీ ట్రస్ట్‌ పేరిట పునరావాస కేంద్రాన్ని నడుపుతున్నారు.

views: 732

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams