Current Affairs Telugu Daily

ఆరు సంవత్సరాల వరకు నోటర్‌డామ్ చర్చి మూసివేత
అగ్నిప్రమాదానికి గురై పాక్షికంగా ధ్వంసమైన పారిస్‌లోని ప్రఖ్యాత నోటర్‌డామ్ కెథడ్రల్‌ను పునరుద్ధణ పనుల కోసం చర్చిని మూసివేయనున్నట్టు బిషప్ పాట్రిక్ చౌవెల్ తెలిపారు.
*ఫ్రాన్స్ ప్రధాని మెక్రాన్ నేతృత్వంలో క్యాబినెట్ సమావేశంలో చర్చి పునరుద్ధరణ, డిజైన్ల కోసం అంతర్జాతీయ స్థాయి పోటీ నిర్వహిస్తామని ప్రకటించారు
*నోటర్‌డామ్‌ చర్చి నిర్మాణాన్ని 1163లో ప్రారంభించినట్టు చరిత్రకారుల అభిప్రాయము
*అప్పటి కింగ్‌ ఏడో లూయిస్‌, మూడో పోప్‌ అలెగ్జాండర్‌ ఆధ్వర్యంలో నిర్మాణం మొదలైంది. చర్చి నిర్మాణాన్ని దశలవారీగా పూర్తిచేయడానికి దాదాపు 182 ఏండ్లు పట్టింది.
*1345 నాటికి చర్చి నిర్మాణం పూర్తయింది.ఒకేసారి ఆరువేల మంది ప్రార్థనలు చేయవచ్చు
*1804లో మొదటి నెపోలియన్‌ చక్రవర్తి పట్టాభిషేకం కూడా ఇక్కడే జరిగింది
*19, 20వ శతాబ్దాల్లో ఫ్రాన్స్‌లో పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా చర్చి ధ్వంసం కావడం మొదలైంది. దీంతో ఎప్పటికప్పుడు పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు.
*ఇది ఒక చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశం గా 850 ఏండ్లకుపైగా చరిత్ర కలిగి వుంది

views: 644

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams