Current Affairs Telugu Daily

అత్యవసర సేవలకు 112
ఎలాంటి సహాయం కావాలన్నా ఒకే ఒక్క కాల్‌తో పరిష్కారం లభించేలా కేంద్ర ప్రభుత్వం ఓ సరికొత్త హెల్ప్‌లైన్‌ నంబర్‌ 112 ను (పాన్‌-ఇండియా) తీసుకొచ్చింది.
*ఈ టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేయడం ద్వారా ఎటువంటి సమస్యకైనా సాయం పొందవచ్చు.
*దీని ద్వారా అన్ని రకాల అత్యవసర సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ది ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ (ఈఆర్ఎస్‌ఎస్‌)ను అభివృద్ధి చేశారు
*ఇప్పటికే ఈ సేవలను కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నప్పటికీ  తాజాగా మరిన్ని రాష్ట్రాలకు విస్తరించారు. దీంతో కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా  20 రాష్ట్రాలు ఈ సేవల పరిధిలోకి వచ్చాయి.
*కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సేవల కోసం నిర్భయ నిధుల నుంచి రూ.321.69 కోట్లను కేటాయించారు. ఇప్పటికే రూ.278.66 కోట్లను విడుదల చేశారు.
*పాన్‌-ఇండియా నెట్‌వర్క్‌ పరిధిలో ప్రస్తుతం హిమాచల్‌ ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్‌, పుదుచ్చేరి, లక్షద్వీప్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు, దాద్రానగర్‌ హవేలి, డామన్‌ డయ్యు, జమ్ముకశ్మీర్‌, నాగాలాండ్‌

views: 766

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams