Current Affairs Telugu Daily

"అరకు కాఫీ" కి భౌగోళిక గుర్తింపు 
విశాఖ జిల్లా అరకులో పండించే అరబికా రకం కాఫీకి భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్-జీఐ) హోదా లభించింది.
*గతంలో విశాఖ ఏజెన్సీలో పండుతున్న ‘అరబికా’ కాఫీ 2009-10 సంవత్సరం నుంచి వరుసగా ఐదుసార్లు ‘ఫైన్‌ కప్‌ ఆఫ్‌ కాఫీ’ అవార్డును సొంతం చేసుకుంది.
*అరకు కాఫీ ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు ఎగుమతి అవుతుంది
పారిస్ లో అరకు కాఫీ స్టోర్:  
*మహీంద్రా & మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ చైర్మన్ సతీష్ రెడ్డి, సోమా నిర్మాణ సంస్థ చైర్మన్ మాగంటి రాజేంద్రప్రసాద్ లు పారిస్ లో అరకు కాఫీ మొదటి స్టోర్ ప్రారంభం అయ్యేందుకు కారణమయ్యారు. ఎందుకంటే ఈ సంస్థల ఆధ్వర్యంలో  అరకు ప్రాంతంలో 20,000 ఎకరాలలో కాఫీ పంట సాగవుతోంది. ఈ సంస్థలే అరకు కాఫీకి అంతర్జాతీయ మార్కెట్ ను తెచ్చిపెట్టాయి.
*అరకు కాఫీతోపాటుగా కర్ణాటక, కేరళలో పండించే కాఫీ గింజలకు కూడా కేంద్రప్రభుత్వం జీఐ హోదా కల్పించింది. దీంతో 2019లో జీఐ హోదా కల్పించిన ఉత్పత్తుల సంఖ్య 14కు చేరింది. దేశంలో మొత్తం 344 ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు ఉంది. 
*జీఐ హోదా లభించిన ఉత్పత్తులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. వీటిని పోలిన ఉత్పత్తులను ఇతరులెవరూ విక్రయించడానికి ఉండదు. అంతేగాకుండా ఆయా ఉత్పత్తుల నాణ్యతను ధృవీకరించేందుకు కూడా ఇది తోడ్పడుతుంది. పదేళ్ల పాటు ఈ ట్యాగ్ వర్తిస్తుంది. ఆ తర్వాత దీన్ని పునరుద్ధరించుకోవచ్చు.

State-wise compilation of Geographical Indications:
  • Andhra Pradesh
  1. rikalahasthi Kalamkari     
  2. Kondapalli Bommalu     
  3. Machilipatnam Kalamkari     
  4. Budiiti Bell & Brass Craft     
  5. Andhra Pradesh Leather Puppetry     
  6. Uppada Jamdani Sarees     
  7. Tirupati Laddu[a]     
  8. Guntur Sannam Chilli     
  9. Venkatagiri Sarees     
  10. Bobbili Veena     
  11. Mangalagiri Sarees and Fabrics     
  12. Dharmavaram Handloom Pattu Sarees and Paavadas  
  13. Banganapally mango 
  • Telangana
  1. Pochampally Ikat     
  2. Silver Filigree of Karimnagar     
  3. Nirmal toys and craft     
  4. Nirmal furniture     
  5. Nirmal paintings     
  6. Gadwal Sarees     
  7. Hyderabadi Haleem     
  8. Cheriyal Paintings     
  9. Pembarthi Metal Craft     
  10. Siddipet Gollabhama     
  11. Narayanpet Handloom Sarees
  12. Adilabad DokraMetal 
  13. Warangal Durries 

views: 1225

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams