Current Affairs Telugu Daily

దేశంలో గృహ ఇంధనాలతో ఏటా 2.7 లక్షల మంది మరణిస్తున్నారు:ఐఐటీ-ఢిల్లీ
వాయు కాలుష్యం కారణంగా భారత్‌లో చనిపోతున్నవారిలో 13శాతం గృహ ఇంధనాల కారణంగా వెలువడే ఆరుబయట కాలుష్యం వల్లే మృత్యువాత పడుతున్నారు అని ఐఐటీ-ఢిల్లీ ఆధ్వర్యాన నిర్వహించిన పరిశోధనలో తేలింది. 
*మనదేశంలో గృహ ఇంధనాల వినియోగాన్ని అరికడితే ఏటా 2.7 లక్షల మంది భారతీయుల ప్రాణాలను కాపాడవచ్చని పరిశోధన లో వెల్లడైంది
*ప్రస్తుతం గాలిలోకి వెలువడుతున్న పారిశ్రామిక లేదా వాహన ఉద్గారాలను , గృహ ఇంధనాల వాడకాన్ని  నియంత్రిస్తే భారత్‌ నిర్దేశించుకున్న వాయు నాణ్యత ప్రమాణాలను తేలిగ్గా చేరుకోవచ్చని వెల్లడించింది. 
*బెర్క్‌లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసరు కిర్క్‌ ఆర్‌ స్మిత్‌ ప్రకారం-కట్టెలు, పిడకలు, బొగ్గు, కిరోసిన్‌వంటివి మండించడం వల్ల ఆరుబయట వాయు కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్నాయి
*2016 తొలినాళ్లలో అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం భారతీయ జనాభాలోని దాదాపు సగంమంది గృహ ఇంధనాల కోసం ‘బయోమాస్‌’పైనే ఆధారపడుతున్నారు.
* వీటివల్ల కార్బన్‌డైఆక్సైడ్‌, మీథేన్‌ తరహా హరితవాయువులు వెలువడుతున్నాయి.
వాయు కాలుష్య నియంత్రణ చట్టాలు:
  • భారత ప్రభుత్వం వాయు కాలుష్య చట్టాన్ని 1981లో రూపొందించింది
  • పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని 1986లో రూపొందించింది

views: 749

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams