Current Affairs Telugu Daily

చైనాలో నిర్వహించనున్న అంతర్జాతీయ విన్యాసాలకు భారత్‌ నౌకలు
ఏప్రిల్ 21 నుండి 23 వరకు  చైనాలోని కింగ్‌దావోలో జరుగనున్న అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ  కార్యక్రమానికి  భారత నౌకలు సిద్ధమయ్యాయి.
*చైనా నేవీ 70వ వార్షికోత్సవాల సందర్భంగా ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. 
*చైనా తీరంలో ప్రారంభం కానున్న నౌకా విన్యాసాలలో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా, ఐఎన్‌ఎస్‌ శక్తి నౌకలు పాల్గొంటాయి
*ఈ ఐఎఫ్‌ఆర్‌ అంతర్జాతీయ స్థాయిలో 50 దేశాల నావికాదళాలకు చెందిన వంద యుద్ధనౌకలు, వీటితో పాటు ఎయిర్‌క్రాఫ్ట్స్‌, సబ్‌మెరైన్‌లు పాల్గోనున్నాయి. 
*వివిధ దేశాల యుద్ధనౌకలు తమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించనున్నాయి. నేవీ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకోనున్నాయి.
ఐఎన్ఎస్ కోలకతా:
• ఐఎన్ఎస్ కోలకతా భారతదేశంలోనే అతిపెద్ద స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ధనౌకగా ఉంది
ఈ యుద్ధనౌక,నేవీ యొక్క డిజైన్ బ్యూరోలో రూపొందించబడి Mazagon dockyards Limited ఆధ్వర్యంలో నిర్మించబడింది.
• ఇది 6800 టన్నుల బరువుతో భారత దేశ సాంకేతిక ప్రదర్శనగా ఉంది
• INS కోలకతాను దాని సముద్ర పరిక్షించడం పూర్తయిన తర్వాత జూలై 2014 లో భారత నావికాదళానికి అందజేశారు
• INS కోలకతా, భారత నౌకాదళంలోని  కోలకతా క్లాస్ డిస్ట్రాయర్లలో ఒక భాగం. నిర్మాణంలో ఉన్న INSకొచీ మరియు INSచెన్నైలు కూడా కోలకతా క్లాస్ డిస్ట్రాయర్ లలో భాగమే.. 
• ఈ యుద్ధనౌక నిర్మాణ ప్రణాళిక సెప్టెంబర్ 2003 లో జరిగినప్పటికీ దానిపై నిర్మాణం మాత్రం 2006 లో ప్రారంభమైంది. కొన్ని అనివార్య కారణాల వల్ల 2010 లోప్రారంభమవ్వాల్సిన INS కోలకతా ఆలస్యమైయింది.

views: 704

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams