Current Affairs Telugu Daily

టాక్టిక‌ల్ గైడెడ్ వెప‌న్‌ అనే కొత్త త‌ర‌హా ఆయుధాన్ని పరీక్షించిన ఉత్తర కొరియా
శక్తిమంతమైన వార్ హెడ్'తో ఒక కొత్త 'టాక్టికల్ గైడెడ్ వెపన్'ను పరీక్షించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది.
*అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ మధ్య జరిగిన చర్చల్లో ఏ ఒప్పందం లేకుండా ముగిసిన తర్వాత ఇలాంటి పరీక్ష జరగడం ఇదే మొదటిసారి.
*ఆ దేశ మీడియా ఈ పరీక్షపై కొన్ని వివరాలు విడుదల చేసింది. కానీ వీటిని అమెరికాకు ముప్పు తెచ్చే లాంగ్ రేంజ్ మిసైల్ ప్రయోగాలను మళ్లీ చేస్తున్నట్లు చూడకూడదని విశ్లేషకులు చెబుతున్నారు.
*ఉత్త‌ర కొరియా ప‌రీక్షించిన టాక్టిక‌ల్ వెప‌న్‌.. నింగి, నేల‌, స‌ముద్రం నుంచి కూడా అదే సామ‌ర్థ్యంతో ప్ర‌యోగించే వీలుంది.
*ఇది యుద్ధ స‌మ‌యంలో వాడే, స్వల్ప దూరం ప్ర‌యాణించే మిస్సైల్ గా పరిగణిస్తున్నారు.
*అణునిరాయుధీకరణపై చర్చించేందుకు డోనల్డ్ ట్రంప్, కిమ్ జాంగ్-ఉన్ ఫిబ్రవరిలో వియత్నాం రాజధాని హనోయ్‌లో భేటీ అయ్యారు. కానీ, చర్చలు విఫలమై ఇద్దరు నేతలూ అర్థంతరంగా వెళ్లిపోయారు

కొరియా దేశాల మధ్య  వైరం ?
*రెండో ప్రపంచ యుద్దం తర్వాత అప్పటి వరకు జపాన్ ఆధీనంలో ఉన్న కొరియా రెండు ముక్కలై 1948లో రెండు దేశాలుగా ఏర్పడింది. 
*ఉత్కర కొరియా భాగం రష్యా ఆధీనంలోకి రాగా..దక్షిణ కొరియా అమెరికా ఆధీనంలోకి వచ్చింది. ఉత్తర కొరియా రష్యా ప్రభావంతో సోషలిస్టు రాజ్యంగా ఆవిర్భవించగా, దక్షిణ కొరియా అమెరికా ప్రభావంతో పెట్టుబడిదారీ వ్యవస్థను అనుసరించింది.
*దక్షిణ కొరియా అమెరికా, జపాన్‌ నుంచి లభించిన పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానంతో శరవేగంగా అభివృద్ధి సాధించింది. అదే సమయంలో ఉత్తర కొరియా ప్రపంచదేశాలతో మమేకం కాలేక వెనుకబడిపోయింది. దీంతో  దక్షిణ కొరియా తమ అవకాశాలను దెబ్బకొడుతుందనే విశ్వాసం నార్త్ కొరియా ప్రజల్లో ఏర్పడింది. దీనికి తోడు ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్య ఉంది.

views: 903



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams