Current Affairs Telugu Daily

2017 డిసెంబర్‌ చివరి నాటికి హైదరాబాద్‌లో రోబో పోలీస్‌
ప్రపంచంలోనే అరుదైన పోలీస్‌ రోబో డిజైన్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేశ్‌ రంజన్‌ 2017 జులై 5న ఆవిష్కరించారు. రోబోల తయారీలో నూతన ఒరవడి సృష్టిస్తున్న హెచ్‌బోట్స్‌ రోబోటిక్స్‌ వ్యవస్థాపకులు 2 నెలలు శ్రమించి పోలీస్‌ రోబో డిజైన్‌కు తుది రూపమిచ్చారు. 2017 డిసెంబర్‌ 31న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ జంక్షన్‌లో పోలీస్‌ రోబోను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం దుబాయ్‌లో మాత్రమే పోలీస్‌ రోబో ఉంది. ప్రపంచంలోనే రెండో పోలీస్‌ రోబో హైదరాబాద్‌లో అందుబాటులోకి రానుంది. గచ్చిబౌలిలో మేకర్స్‌ లీవే హైఎండ్‌ రోబోటిక్‌ ల్యాబ్‌ను జయేష్‌ రంజన్‌ ప్రారంభించారు.  
views: 1304

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams