Current Affairs Telugu Daily

2019 సంవత్సరానికి బ్రిటన్‌ రాయల్‌ సొసైటీ గౌరవ ఫెలోగా సిప్లా ఛైర్మన్‌ హమీద్‌ ఎంపిక
ప్రముఖ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, ఔషధ రంగ దిగ్గజ సంస్థ సిప్లా ఛైర్మన్‌ యూసుఫ్‌ హమీద్‌(82)కు బ్రిటన్‌ రాయల్‌ సొసైటీ గౌరవం దక్కింది.
*ప్రపంచంలోని ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కూడిన రాయల్‌ సొసైటీ గౌరవ ఫెలోగా హమీద్‌ 2019 సంవత్సరానికి ఎంపికయ్యారు.
*ఆయనతోపాటు 51 మందికి ఈ పురస్కారం దక్కింది.
*భారత శాస్త్రవేత్తల్లో ప్రొఫెసర్‌ గురుదయాళ్‌ బెస్రా, ప్రొఫెసర్‌ మంజుల్‌ భార్గవ, ప్రొఫెసర్‌ అనంత్‌ పరేఖ్‌, ప్రొఫెసర్‌ అక్షయ్‌ వెంకటేష్‌లు పురస్కారానికి ఎంపికయ్యారు. 
తొలి మహిళగా గగన్‌దీప్‌ ఘనతః
బ్రిటన్‌ రాయల్‌సొసైటీ ఫెలోగా ఎంపికైన భారత తొలి మహిళా శాస్త్రవేత్తగా ప్రొఫెసర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ రికార్డు సృష్టించారు. కాంగ్‌ ఫరీదాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌, టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చిన్నారుల్లో వైరల్‌ ఇన్‌ఫెక్షన్లపై ఆమె పరిశోధనలు నిర్వహించారు.

views: 741

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams