Current Affairs Telugu Daily

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ -2019 జాబితాలో భారత్ కు140వ స్థానం 
ఫ్రాన్స్‌ కేంద్రంగా పని చేస్తున్న ‘‘రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌’’ నివేదిక ప్రకారం ‘‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ 2019’’లో మనదేశం 140వ స్థానంలో నిలిచింది.
*ప్రపంచవ్యాప్తంగా ఈ సూచీలో నార్వే మొదటిస్థానంలో నిలిచింది. 
*ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో పాత్రికేయులు మరింత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారని ఈ నివేదిక తెలిపింది.
నివేదిక ముఖ్యాంశాలు:
*180 దేశాలతో రూపొందించిన ‘‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ 2019’’లో మనదేశం 140వ స్థానంలో నిలిచింది
*గత ఏడాదితో పోలిస్తే రెండు స్థానాలు దిగజారింది.
*పాకిస్థాన్‌-142, బంగ్లాదేశ్‌-150, చైనా-177, ఉత్తరకొరియా-179, తుర్కెమెనిస్థాన్‌ 180వ స్థానంలో నిలిచాయి

views: 723



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams