Current Affairs Telugu Daily

తెలంగాణలో నెలరోజుల పాటు రైతు సమగ్ర సర్వే 
రాష్ట్రంలో నెలరోజుల పాటు రైతు సమగ్ర సర్వే చేపట్టలని వ్యవసాయశాఖ సిబ్బందికి  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు 
*దీనితో మే 20వ తేదీ కల్లా సమగ్ర సర్వే పూర్తిచేసేందుకు వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
*కొత్త పట్టాదారు పాసుపుస్తకం అందిన వారి వివరాల సేకరణ  మరియు రైతుల ఇళ్లకు ప్రతి ఏఈవో వెళ్లి  ఎంత భూమి ఉంది, బోర్లు, వ్యవసాయ యంత్రాల సంఖ్య, ఆయా సీజన్లలో ఏ పంటలు సాగుచేస్తున్నారు, హరితపందిరి ఉందా, ఉంటే అందులో ఏం పండిస్తున్నారు, ఆధార్‌, బ్యాంకు ఖాతా సంఖ్యలు..తదితర సమాచారమంతా రైతు నుంచి తీసుకుని ఆన్‌లైన్‌లో  నమోదు చేయాలి
*ఒకే పంటను రైతులంతా సాగుచేయకుండా డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో అక్కడి వాతావరణానికి అనుగుణంగా పండ్లు, కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు పంటల కాలనీలు ఏర్పాటుచేస్తారు. 
*తాము చేసే సమగ్ర సర్వేలో కొత్త పట్టాదారు పాసుపుస్తకం అందిన లేదా డిజిటల్‌ సంతకం అయిన రైతుల జాబితాలనే తీసుకుంటామని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ‘ వెల్లడించారు.

views: 888

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams