Current Affairs Telugu Daily

తెలంగాణ హైకోర్టు శత సంవత్సర వేడుకలు 
 కాలక్రమేణా న్యాయస్థానాల పేర్లు మారుతూ వస్తున్నా వందేళ్లుగా ఈ  భవనం సేవలందిస్తూ వస్తోంది. ఏప్రిల్‌ 20 నాటికి ఈ హైకోర్టు భవనానికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవ సంబరాలను నిర్వహించాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌తో కలిసి న్యాయమూర్తులందరూ నిర్ణయించారు
చారిత్రక నేపధ్యం:
*హైదరాబాద్‌ ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1920 ఏప్రిల్‌ 20న హైకోర్టు భవనం అధికారికంగా ప్రారంభమైంది.
*రాయల్‌ ఛార్టర్‌ 1928 హైకోర్టు యాక్ట్‌ కింద బెంచ్‌లను ఏర్పాటు చేసి కేసుల విచారణ మొదలుపెట్టారు
స్వాతంత్య్రం అనంతరం హైదరాబాద్‌ విలీనం తరువాత హైకోర్ట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ పేరుతో కొనసాగింది. 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. 
*ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇదే భవనంలో  1956 నవంబరు 5న 11 మంది జడ్జీలతో ప్రారంభమైంది.
2014 జూన్‌ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. 
*దీంతో అదే తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు రెండు రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి హైకోర్టుగా కొనసాగింది. రాష్ట్రపతి ఉత్తర్వులతో 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అమరావతిలో ఏర్పాటైంది. 
*ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకావడంతో తెలంగాణ రాష్ట్ర హైకోర్టుగా కొనసాగుతోంది. 

నిర్మాణ విశేషాలు:
  • భవన నమూనా :  ఆర్కిటెక్ట్‌ శంకర్‌లాల్‌ (జైపూర్‌కు చెందిన ఇంజినీరు)
  • నిర్మాణ పనుల నిర్వహణ - మెహర్‌ అలీ ఫజల్‌ 
  • భవనం నిర్మాణ ఆకృతి -   విన్‌సెంట్‌ జె.ఎక్‌ 
  • వ్యయ అంచనా - దాదాపు రూ.18,22,750 
  • కాంట్రాక్ట్‌ -  నవరతన్‌ దాస్‌
శైలి :    ఇండో-ఇస్లామిక్‌ సంప్రదాయ రీతిలో డోమ్‌ల ఆకృతి 
*గులాబీ రంగు గ్రానైట్‌, రాతితో నిర్మించిన అద్భుత కళా ఖండం.

హైకోర్టు భవనం పక్కనే నిజాం కాలం నుంచి సేవలందిస్తున్న జజ్గీఖానా (ప్రసూతి ఆస్పత్రి)ను మరో ప్రాంతానికి తరలించి ఆస్పత్రికి చెందిన 9.5 ఎకరాలను 2009లో హైకోర్టుకు అప్పగించారు

views: 879

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams