Current Affairs Telugu Daily

నోట్ల రద్దు తర్వాత 50 లక్షల మంది ఉద్యోగాల్ని కోల్పోయినట్లు అజింప్రేమ్‌జీ వర్సిటీ నివేదిక వెల్లడి
వేగవంతంగా ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందనిఅజింప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. 
*2016-18లో 50 లక్షల మంది ఉద్యోగాల్ని కోల్పోయినట్లు , ఉద్యోగాల నష్టం 2016 నవంబర్‌లో చేపట్టిన నోట్ల రద్దు తర్వాత మొదలైనట్లు గా గుర్తించింది. 
*‘శ్రామిక భారత్‌-2019’ పేరిట విడుదలైన ఈ నివేదికలో సాధారణ నిరుద్యోగిత 2011 నుంచే స్థిరంగా పెరగడం మొదలైనట్లు పేర్కొంది.
*ఆర్థిక వృద్ధి ర్యాంకుల్లో పెద్ద దేశాల సరసన సుస్థిరంగా సాగుతున్నా ఉద్యోగ కల్పనలో మాత్రం తీవ్రంగా వెనకబడిందని ఈ సమస్యను ఎదుర్కొనేందుకు అత్యవసరంగా ప్రభుత్వ పరంగా ఓ విధానాన్ని తీసుకురావడం, బడ్జెట్‌ పరంగా తగిన మద్దతు అందించడం, వేగవంతంగా ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని బెంగళూరులోని అజింప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది.
నివేదిక ముఖ్యాంశాలు:
  • ‘శ్రామిక భారత్‌-2019’ పేరిట ఈ నివేదిక విడుదల చేశారు
  • మొత్తంగా నిరుద్యోగిత రేటు 2000 నుంచి 2011 మధ్య దశాబ్దకాలంతో పోలిస్తే 2018లో రెట్టింపై సుమారు 6 శాతంగా ఉంది.
  • నిరుద్యోగుల్లో ఎక్కువగా 20-24 ఏళ్ల మధ్య వయస్కులే మరియు ఎక్కువగా ఉన్నత విద్యావంతులు, యువతే ఉన్నారు.
  • ఉన్నత విద్యావంతుల్లోనే కాకుండా, తక్కువగా చదువుకున్న శ్రామికుల్లోనూ 2016 నుంచి ఉద్యోగ నష్టం వాటిల్లింది.
  • ఈ సర్వేలో 2017-18లో నిరుద్యోగిత రేటు ఎన్నడూ లేనంతగా 6.1 శాతానికి పెరిగినట్లు అంచనా వేసింది
  • భారత్‌లో ఆర్థిక వృద్ధి పేదరికం రేట్లను గణనీయంగా తగ్గించగలిగినా, అది ఉద్యోగ కల్పనలోకి రూపాంతరం చెందలేదని ,పేదరిక నిర్మూలనకు అత్యుత్తమ పరిష్కారం తగిన ఉద్యోగాల్ని కల్పించడమే నని స్పష్టం చేసింది

views: 693

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams