Current Affairs Telugu Daily

రూఫ్‌ టాప్‌ సౌర విద్యుత్‌కు 40శాతం సబ్సిడీ
*రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్యానెళ్లు, విద్యుత్‌ వాహనాలకు సంబంధించిన కుసుమ్‌ పథకంలో భాగంగా సౌర విద్యుత్‌ను ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న 30శాతం సబ్సిడీని 40 శాతానికి పెంపు. ఇది మే 1 నుంచి వర్తిస్తుందని తెలిపారు.
*సంప్రదాయేతర ఇంధన రంగంలో ఉన్న అవకాశాలను, కొత్త సాంకేతికతను పరిచయం చేసేందుకు రెన్యూఎక్స్‌ 2019 ప్రదర్శన ఈ నెల 26 -27 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో యూబీఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
ఈ నాలుగో విడత ప్రదర్శనలో సౌర విద్యుత్‌కు సంబంధించిన అనేక అంశాలపై చర్చలు, పరికరాల ప్రదర్శన నిర్వహించనున్నారు
*ప్రభుత్వం రూఫ్‌ టాప్‌ సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునే వారిని  ప్రోత్సహించడం కోసం సబ్సిడీ శాతంను పెంపు చేశారు.
కుసుమ్ (కిసాన్ ఊర్జా సురక్షా ఏవమ్ ఉత్థాన్ మహాభియాన్):
  • దేశంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది.
  • సౌర విద్యుత్ వినియోగించేలా రైతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ పథకం జూలై నుంచి అమల్లోకి వచ్చింది.
  • కుసుమ్ పథకం ఇచ్చే సౌర విద్యుత్ మోటార్లు రెండు విధాలుగా ఉంటాయి. 17.5 లక్షల మోటార్ల వద్ద ఏర్పాటు చేసే సోలార్ ప్యానల్స్ నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్ ను ఆ మోటర్ల కోసమే వినియోగిస్తారు. మరో 10 లక్షల సౌర విద్యుత్ మోటార్ల వద్ద ఏర్పాటు చేసే సోలార్ ప్యానల్స్ నుంచి ఉత్పత్తయ్యే అదనపు విద్యుత్ (మోటార్ల అవసరం తీరిన తర్వాత)ను రైతులు విక్రయించుకోవచ్చు. దీని కోసం వీటిని గ్రీడ్ తో అనుసంధానం చేస్తారు. ఇలా మిగులు విద్యుత్ ను విక్రయించుకునే అవకాశం కల్పించడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చును

views: 836

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams