Current Affairs Telugu Daily

టైమ్‌ మ్యాగజైన్‌ రూపొందించిన అత్యంత ప్రభావశీలుర జాబితాలో స్థానం పొందిన ఏకైక భారతీయ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ
ప్రపంచవ్యాప్తంగా వందమంది అత్యంత ప్రభావశీలురతో ‘‘టైమ్‌’’ మ్యాగజైన్‌ రూపొందించిన జాబితాలో మనదేశం తరఫున ఎంపికైన ఏకైక భారతీయ పారిశ్రామికవేత్తగా  ముకేశ్‌ అంబానీ నిలిచారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీలురైన మార్గదర్శకులు, నాయకులు, దిగ్గజాలు, కళాకారులు, ఐకాన్లతో కూడిన 2019 జాబితాను టైమ్‌ మ్యాగజైన్‌ వెల్లడించింది.
*‘ఎల్‌జీబీటీక్యూ’ల హక్కుల కోసం మనదేశంలో పోరాడిన న్యాయవాదులు అరుంధతి కట్జు, మేనక గురుస్వామి కూడా జాబితాలో చోటు దక్కించుకున్నారు.
*భారత మూలాలున్న అమెరికా కమెడియన్‌, టీవీ వ్యాఖ్యాత హసన్‌ మిన్హాజ్‌, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, పోప్‌ ఫ్రాన్సిస్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌, ప్రముఖ గోల్ఫ్‌ క్రీడాకారుడు టైగర్‌వుడ్స్‌, ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
టైమ్‌ మ్యాగజైన్‌:
  • టైమ్ ప్రపంచంలో అతిపెద్ద వార్తా వారపత్రిక
  • ఇది సంయుక్త రాష్ట్రాలలో మొట్టమొదటి వార్తా వార పత్రిక
  • 1923లో బ్రిటన్ హాడెన్ మరియు హెన్రీ లూస్ కలిసి టైమ్ పత్రికను ప్రారంభించారు
  • టైమ్ యొక్క మొట్టమొదటి సంచిక 1923 మార్చి 3 నాడు ప్రచురింప బడింది, దీని ముఖచిత్రంపై పదవీవిరమణ పొందిన సంయుక్త రాష్ట్రాల ప్రతినిధుల సభ యొక్క స్పీకర్ జోసెఫ్ G. కానన్ చిత్రం ముద్రించబడింది

views: 740

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams