Current Affairs Telugu Daily

అంతరిక్ష శిలల నుంచి రక్షణకు కొత్త విధానం
భూమికి సమీపంలోని చిన్నపాటి శిలలను చాలా ముందుగానే గుర్తించే ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దీనివల్ల ఆ ఖగోళవస్తువులు భూమిని ఢీ కొట్టకుండా నిరోధించే చర్యలకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు.
అదనపు సమాచారం:
భారీ సంఖ్య లో అంతరిక్ష శిలలు ఢీకొట్టడం ద్వారా ప్రతీ 81 వేల సంవత్సరాలకోసారి చంద్రుడి ఉపరితలం కొత్త రూపాన్ని సంతరించుకొంటున్నదనే విషయం తాజా అధ్యయనంలో వెల్లడైంది.
*ఈ ప్రక్రియ ద్వారా దాదాపు రెండు సెంటీమీటర్ల మేర చంద్రుడు దుమ్ము, ధూళిని కోల్పోతున్నాడనే విషయాన్ని ఈ అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. గత అధ్యయనాల్లో ఊహించిన దానికంటే 100 రెట్లు ఈ ప్రక్రియ జరుగుతున్నదని శాస్త్రజ్ఞులు వెల్లడించారు.
*చంద్రుడిని గ్రహ శకలాలు, తోకచుక్కలు ఢీకొట్టడం వల్ల దాని ఉపరితలంపై తక్కువలో తక్కువ 10 మీటర్ల వ్యాసార్థంతో ప్రతిఏటా సగటున కొత్త బిలాలు ఏర్పడుతున్నట్టు పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
*చంద్రుడిపై వాతావరణ పరిస్థితిని అధ్యయనం చేయడానికి 2009లో పంపిన నాసా లూనార్ రెకానాయిసెన్స్ ఆర్బిటర్ అంతరిక్షనౌక తీసిన చిత్రాల ఆధారంగా శాస్త్రజ్ఞులు నిర్ధారణకు వచ్చారు

నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ మరియు స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ):
  • స్థాపన : 1958
  • ప్రధాన కేంద్రం:  వాషింగ్టన్
  • నినాదం: ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్

views: 775

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams