Current Affairs Telugu Daily

అంతరిక్ష వాతావరణాన్ని విశ్వసనీయంగా అర్థం చేసుకోవడం కోసం సూర్యుడి రేడియో చిత్రాలు సేకరణ
అంతరిక్ష వాతావరణం, భూమిపై అది చూపే ప్రభావం గురించి అత్యంత కచ్చితత్వంతో అంచనా వేయడానికి  సూర్యుడికి సంబంధించి అత్యంత విస్పష్టమైన రేడియో చిత్రాలను శాస్త్రవేత్తలు సేకరించారు.
*సౌర కుటుంబంలోని సూర్యుడిపై అత్యంత శక్తిమంతమైన విస్ఫోటాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వాటి వల్ల తలెత్తే సమస్యలను అర్థం చేసుకోవాదానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
*సూర్యుడి వాతావరణంలోని అయస్కాంత క్షేత్రాలు, బాహ్య వలయమైన కరోనాలు ఈ భారీ విస్ఫోటాలకు ప్రధాన కారణం. ఈ విస్ఫోటాలను అంచనా వేసేందుకు ఉపకరిస్తాయి 
*ఆస్ట్రేలియాలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ముర్చిసన్‌ వైడ్‌ఫీల్డ్‌ అర్రే (ఎండబ్ల్యూఏ) సౌర అధ్యయనాలకు చాలా అనువుగా ఉంది. దీని సాయంతో పుణెలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ రేడియో ఆస్ట్రోఫిజిక్స్‌ (ఎన్‌సీఆర్‌ఏ) శాస్త్రవేత్తల నేతృత్వంలోని అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఈ పరిశోధన చేపట్టింది.
*సౌర ఉద్గారాల్లో వేగంగా జరిగే మార్పులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించడానికి ప్రతి గంటకు దాదాపు 10లక్షల సౌర చిత్రాలను తీయాల్సి ఉంటుంది. ఇందుకోసం శాస్త్రవేత్తలు ఇటీవల ఆటోమేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ పైప్‌లైన్‌ను అభివృద్ధి చేశారు. ఇది అద్భుతమైన స్పష్టతతో సూర్యుడి చిత్రాలను అందించింది.

views: 727

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams