Current Affairs Telugu Daily

2050నాటికి దేశ జనాభాలో 20% వృద్ధులు
2030నాటికి జనాభాకు సంబంధించి చైనాను దేశం దాటేయనుందని అంచనాలు వేస్తున్న తరుణంలో  మనదేశంలో 60 ఏళ్లు, అంతకంటే వృద్ధుల సంఖ్య 2050నాటికి జనాభాలో సుమారు 20% వరకు ఉంటారని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్‌ మొదటి కార్యదర్శి పౌలోమి త్రిపాఠి వెల్లడించారు.
*దీనితోపాటు అప్పటికి 15ఏళ్లలోపు ఉండేవారి సంఖ్యకంటే వృద్ధులసంఖ్యే ఎక్కువగా ఉంటుందనీ పేర్కొన్నారు
ప్రపంచంలో మరెక్కడా లేనంతగా మన దేశంలోనే ఇప్పుడు 50% పైగా జనాభా 25 ఏళ్లలోపు వారు, 2020 నాటికల్లా 35.6 కోట్ల మంది యువతీ యువకులతో ప్రపంచం మొత్తమ్మీద యువ జనాభా అత్యధికంగా ఉన్న దేశంగా మనం చరిత్ర సృష్టించబోతున్నాం అని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాని 2050 నాటికి ఈ విధమైన పరిస్థితులు ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
*వచ్చే ఏడాది (2020) కల్లా మన దేశ జనాభా సగటు వయసు 29 సంవత్సరాలు కాబోతోంది.
  • యువత ఎందుకు ముఖ్యం? 
సమాజంలో ఎప్పుడూ కూడా మార్పు వేగంగా ప్రతిఫలించేదీ, ప్రస్ఫుటంగా కనబడేది యువతలోనే! సాంకేతిక పురోగతి నుంచి సామాజిక తారతమ్యాలను అధిగమించటం వరకూ.. చాలా అంశాల్లో యువతే ముందుంటుంది. అందుకే ‘‘ప్రజల వైఖరిలో మార్పు వచ్చిన ప్రతిసారీ.. మెరుగైన సమాజాన్ని నిర్మించేందుకు కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ విషయాన్ని మనం విస్మరించకూడదు’’ అంటారు యువ మనస్తత్వ అధ్యయనవేత్త జేన్‌ బకింగ్‌హామ్‌.
*ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం దేశాలవారీగా యువ జనాభా (2014, నవంబర్‌)
  • భారత్‌    - 35.6 కోట్లు
  • చైనా    - 26.9 కోట్లు
  • ఇండోనేసియా    - 6.7 కోట్లు
  • అమెరికా    - 6.5 కోట్లు
  • పాకిస్థాన్‌    - 5.9 కోట్లు
  • నైజీరియా    - 5.7 కోట్లు
*ప్రస్తుత భారతీయుడి సగటు వయస్సు 28 ఏళ్లు. అమెరికన్ల సగటు వయస్సు 38 ఏళ్లు. 2020 నాటికి భారత్‌లో పనిచేసేవారి సంఖ్య 64శాతం. కారణం అప్పటికి భారతీయుల సగటు వయస్సు 29 ఏళ్లు ఉండటం. 
*2020 నాటికి చైనీయుల సగటు వయస్సు 37 ఏళ్లు.
*వాషింగ్‌టన్‌ డీసీ గాలప్‌ స్టడీస్‌ ఆధ్వర్యంలో 2011లో సమాజిక బాధ్యతలో యువత భాగస్వామ్యంపై 130 దేశాల్లోని యువతపై ఓ అధ్యయనం జరిగింది.

views: 670

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams