దేశవ్యాప్తంగా 358 గనుల లీజులపై కేంద్రానికి సుప్రీం నోటీసు
* దేశవ్యాప్తంగా 358 గనుల నుంచి ఇనుప ఖనిజం తవ్వకాల కోసం వివిధ సంస్థలకు జరిపిన కేటాయింపులు, పొడిగింపు లీజుల్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు స్పందించింది.
* జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎస్ఏ నజీర్లతో కూడిన ధర్మాసనం దీనిపై కేంద్రానికి నోటీసు జారీ చేసింది.
* సహజ సంపదను ఉచితంగా కేటాయించడంగానీ, పొడిగించడంగానీ చేయొద్దని సుప్రీంకోర్టు గతంలోనే పేర్కొన్న విషయాన్నీ ప్రశ్నిస్తూ, ఈ లీజుల పొడిగింపు చట్టానికి వ్యతిరేకమనీ పిటిషనర్ ఆరోపించారు.
అదనపు సమాచారం:-
గనుల చట్టం (The Mines Act), 1952
* గనుల చట్టం-1952లోని నిబంధనల ప్రకారం వారు భూగర్భ గనుల్లో పనిచేయడానికి వీలులేదు. ఓపెన్ కాస్ట్, ఉపరితలంలో మాత్రమే విధులు నిర్వర్తించేవారు. ఇప్పుడు ఈ నిబంధనలను సవరిస్తూ కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇకపై మహిళలు భూగర్భ గనుల్లోకి వెళ్లే వెసులుబాటు కల్పించింది.
* బొగ్గు గనుల చట్టం (స్పెషల్ ప్రొవిజన్స్ ) – 2015.
views: 762