Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌ కు ప్రకటించిన 'ఉదయ్‌ డబుల్‌డెక్కర్‌ సిద్ధం'
* 2016 బడ్జెట్‌లో అప్పటి రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు ప్రకటించిన ఉదయ్ డబుల్‌ డెక్కర్‌ రైళు ప్రారంభించడానికి రైల్వేశాఖ అంగీకరించింది. 
* గతంలో ఉదయ్‌ (ఉత్కృష్ట్‌ డబుల్‌ డెక్కర్‌ ఏసీ యాత్రి) మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండేందుకు ఉద్దేశించిన మూడు డబుల్‌ డెక్కర్‌ రైళ్లను ప్రకటించారు. అందులో ఒకటి, విశాఖపట్నం - విజయవాడకు కేటాయించారు.
* మిగిలినవి కోయంబత్తూరు-బెంగళూరుల మధ్య, బాంద్రా-జామ్‌నగర్‌ల మధ్య కేటాయించబడినవి.
* గతేడాదే కోయంబత్తూరు-బెంగళూరుల మధ్య రైలును ప్రారంభించారు.         
* మూడేళ్ల క్రితం కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రయాణికులకు ప్రకటించిన ఉదయ్‌ (ఉతృష్ట్‌ డబుల్‌ డెక్కర్‌ ఎయిర్‌ కండీషన్డ్‌ యాత్రి) రైలు నడిపేందుకు రైల్వేబోర్డు తూర్పుకోస్తా జోన్‌కు 11 బోగీలను కేటాయించింది.
 
  • ఉదయ్‌ (ఉతృష్ట్‌ డబుల్‌ డెక్కర్‌ ఎయిర్‌ కండీషన్డ్‌ యాత్రి)
* ఈ రైళ్లలో అన్నీ ఏసీ బోగీలే ఉంటాయి. 
* పాత రకం డబుల్‌ డెక్కర్‌కు ఆధునిక హంగులు కల్పించి ‘ఉదయ్‌’ రైలును రైల్వే శాఖ ప్రారంభించింది.

తయారి: పంజాబ్‌లో కపుర్తలాలోని రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ
 
  • భారతీయ రైల్వేలు:-
* దేశంలో మొదట రైల్వేలను ప్రారంభించాలనే భావన 1832లో కలిగింది.
* 1844 లో అప్పటి గవర్నర్ జనరల్ హార్డింజ్ రైల్వే వ్యవస్థ ఏర్పాటుకు ప్రైవేటు వ్యక్తులను ఆహ్వానించారు.
* గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసి కాలంలో రైల్వే వ్యవస్థను ప్రారంభించారు.

views: 1067

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams