Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులుగా సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌, ఎం. వెంకటరమణ
* ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఎన్‌వీ రమణలతో కూడిన కొలీజియం 
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులుగా సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌, ఎం. వెంకటరమణ పేర్లను  సిఫార్సు చేసింది.
* తెలుగు రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తుల పదవులకు మొత్తం ఏడుగురి పేర్లను పరిశీలించిన కొలీజియం ప్రస్తుతానికి ఈ ఇద్దరి పేర్లను ఖరారు చేసింది.
  • సీహెచ్‌. మానవేంద్రనాథ్‌ రాయ్‌
* ప్రస్తుతం ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా (ఆర్‌జీ) సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ సేవలందిస్తున్నారు.
*2015 జులై నుంచి హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి హైకోర్టు విభజన సమయంలో ఆర్‌జీగా కీలకపాత్ర పోషించారు.
  • ఎం.వెంకటరమణ
* 1987 ఏప్రిల్‌ 1న జూనియర్‌ సివిల్‌ జడ్జిగా (జేసీజే) ఎంపికయ్యారు.
* గతంలో హైదరాబాద్‌లోని సీబీఐ ప్రధాన కోర్టు జడ్జిగా పనిచేశారు. ఈ ఏడాది జనవరి 7 నుంచి కర్నూలు జిల్లా పీడీజేగా విధులు నిర్వర్తిస్తున్నారు.
  • కొలీజియం:
* సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామక విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి, నలుగురు ఇతర సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తుల సలహాను తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీల విషయంలో ఇద్దరు సీనియర్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సలహాను తప్పనిసరిగా పాటించాలి. దీనినే కొలీజియం వ్యవస్థగా పరిగణించారు.

* 1993లో(రెండో జడ్జస్‌ కేసు) సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్స్‌ అసోసియేషన్‌, యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో జస్టిస్‌ జె.ఎస్‌. వర్మ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యులు ఉన్న ధర్మాసనం మొదటిసారిగా కొలీజియం వ్యవస్థ గురించి పేర్కొంది.

* భారత ప్రధాన న్యాయమూర్తి, నలుగురు ఇతర సీనియర్‌ న్యాయమూర్తుల సూచనలను కూడా తీసుకుని, తన సూచనలు జోడించి తుది నిర్ణయాలను భారత ప్రభుత్వానికి రాతపూర్వకంగా అందించాలి.
న్యాయమూర్తుల నియామకం, బదిలీల విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి స్వతంత్రంగా వ్యక్తిగత సామర్థ్యాలకు అనుగుణంగా వ్యవహరించాడానికి వీలు లేదు. అతను తప్పనిసరిగా కొలీజియం వ్యవస్థలోని ఇతర నలుగురు న్యాయమూర్తుల సలహాను కూడా పాటించాలి.

* సంప్రదింపుల ప్రక్రియలోని నిబంధనలను పాటించకుండా భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన సిఫార్సులకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు.
​​​​​​​
* 1993 నుండి కొనసాగుతున్న కొలీజియం విధానాన్ని రద్దు చేస్తూ, కేంద్ర ప్రభుత్వం నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్‌మెంట్ కమిషన్ యాక్ట్ (ఎన్‌జెఎసి)ను 2015 ఏప్రిల్ 13న తీసుకువచ్చింది. భారత సర్వోన్నత న్యాయస్థానం ఈ కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని 2015 అక్టోబర్ 16న తీర్పు చెప్పడంతో గతంలో ఉన్న కొలీజియం వ్యవస్థ ప్రస్తుతం కొనసాగుతుంది.

views: 1159

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams