Current Affairs Telugu Daily

ఎన్నికల చరిత్రలోనే తొలిసారిగా విద్వేష పూరిత, నిందాపూర్వక ఉపన్యాసాలు చేసేవారిపై నిషేధం విధించిన ఈసీ 
విద్వేష పూరిత, నిందాపూర్వక ఉపన్యాసాలు చేసేవారిపై దేశ ఎన్నికల చరిత్రలోనే తొలిసారిగా నిషేధాస్త్రం సంధించింది.
*ఎన్నికల్లో కులం, మతం, ప్రాంతం, భాషల ఆధారంగా ప్రచారం చేసే నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రవాస భారతీయుడు హార్‌ప్రీత్‌ మన్‌సుఖాని దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి, జస్టిస్‌ దీపక్‌ గుప్త, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది 
*దీనికి స్పందిస్తూ అదుపు తప్పిన రాజకీయ నాయకుల ప్రసంగాలకు కళ్లెం వేసే దిశగా ఎట్టకేలకు ఎన్నికల సంఘం గట్టి చర్యలకు ఉపక్రమించింది.
*ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత అజంఖాన్‌లు 72 గంటల పాటు, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, కేంద్ర మంత్రి మేనకా గాంధీలు 48 గంటలపాటు ప్రచారంలో పాల్గొనకుండా ఆంక్షలు విధించింది.
*అంతకుముందు  విద్వేషపూరిత ప్రసంగాల ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులపై సత్వర చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారంటూ ఎన్నికల సంఘం (ఈసీ)పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
*ఇలాంటి నాయకులపై చర్యలు తీసుకునేందుకు ఈసీకి చట్టపరంగా ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అన్న విషయాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది.
*రాజ్యాంగంలోని 324వ అధికరణం ప్రకారం వారిపై ఈ నిషేధాన్ని విధించింది. ఈ సమయంలో ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదని, ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా నిషేధమని పేర్కొంటూ ఉత్తర్వు ఇచ్చింది.

views: 902



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams