Current Affairs Telugu Daily

అభ్యుదయ జిల్లాల పథకం కింద ఎంపికైన జిల్లాల కలెక్టర్లను తరచూ మార్చవద్దని నీతిఆయోగ్‌ ఆదేశం 
అభ్యుదయ జిల్లాల పథకం కింద ఎంపికైన జిల్లాల కలెక్టర్లను తరచూ మార్చవద్దని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను నీతిఆయోగ్‌ ఆదేశించింది.
*దేశవ్యాప్తంగా ఈ పథకం కింద నీతిఆయోగ్‌ 112 జిల్లాలను ఎంపిక చేసింది. ఇందులో ఏపీ నుంచి కడప, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలున్నాయి.
*ఈ పథకం అమలు కోసం ఒక్కో జిల్లాకు రాష్ట్రం నుంచి ఒక అధికారిని, కేంద్రం నుంచి ఒక అధికారిని కేటాయించారు. ఈ పథకం లక్ష్యాలు నెరవేరే వరకూ కలెక్టర్లను తరచూ మార్చవద్దని సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి లేఖ రాసింది.

views: 786



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams