Current Affairs Telugu Daily

10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు కోసం కేంద్ర విద్యా సంస్థల్లో అదనంగా 2లక్షల సీట్లు

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 10 శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న 158 కేంద్ర విద్యా సంస్థ (సీఈఐ)ల్లో రెండు లక్షలకుపైగా సీట్లను కొత్తగా జోడించనున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్‌ సమావేశం ఇందుకు సమ్మతి తెలిపింది.
‘‘క్యాబినెట్‌ నిర్ణయంతో అదనంగా 2,15,766 సీట్లను సృష్టించడానికి మార్గం సుగమమైంది.
*2019-20 విద్యా సంవత్సరంలో 1,19,983 అదనపు సీట్ల వస్తాయి. 2020-21 కాలంలో 95,783 సీట్లను జోడిస్తాం’’ అని వివరించాయి.
*ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులకు ప్రవేశాల్లో రిజర్వేషన్లు అమలుచేసేందుకు కేంద్ర విద్యా సంస్థలకు రూ.4315.15 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపాయి.
 ఆర్థికంగా వెనకబడిన కోటా అర్హులు:
ప్రతిపాదిత ప్రామాణికాల ప్రకారం ఎవరు ఈ వర్గంలోకి వస్తారంటే..
* వృత్తిపరంగా, వ్యవసాయ పరంగా వార్షికాదాయం రూ.8 లక్షల కన్నా తక్కువ ఉన్నవారు...
* అయిదెకరాల కన్నా తక్కువ వ్యవసాయ భూమి, 1,000 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణం ఉన్న ఇల్లు కలిగి ఉన్నవారు...
* నోటిఫైడ్‌ మున్సిపల్‌ ప్రాంతాల్లో 100 గజాల కన్నా తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారు..
* నాన్‌-నోటిఫైడ్‌ మున్సిపల్‌ ప్రాంతంలో 200 గజాలకన్నా తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారు..
*ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు సాధారణ విభాగంలో రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాజ్యాంగంలోని 15, 16 అధికరణలను సవరించారు.

views: 786

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams