Current Affairs Telugu Daily

ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసమైన వాణిజ్య లోటు 19.4 శాతానికి తగ్గింది
ఔషధ, రసాయనాల, ఇంజినీరింగ్‌ విభాగాల్లో అధిక వృద్ధి ఉన్నప్పటికినీ ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసమైన వాణిజ్య లోటు 19.4 శాతం తగ్గి 10.89 బి. డాలర్లకు చేరుకుంది. 
*గత ఏడాది మార్చిలో 13.51 బి. డాలర్లుగా ఇది ఉంది. 
*పూర్తి ఆర్థిక సంవత్సరాని(2018-19)కి దిగుమతులు 8.99 శాతం , ఎగుమతులు 9.1 శాతం సాధించాయి.
‘గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి బాగున్నా  అంతర్జాతీయ మందగమనం కారణంగా 2018-19లో ఎగుమతులు 331.02 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేసి,అంతర్జాతీయంగా సవాలు భరిత వాతావరణం ఉన్నా దీన్ని సాధించామ’ని వాణిజ్య మంత్రిత్వ శాఖ  పేర్కొంది.
*పూర్తి ఏడాదిలో పెట్రోలియం(28%), ప్లాస్టిక్‌(25.6%), రసాయనాలు(22%), ఔషధ(11%), ఇంజినీరింగ్‌(6.36%) రంగాలు మెరుగైన వృద్ధిని కనబరచాయి.
*చమురు దిగుమతులు 29.27% వృద్ధితో 140.47 బి. డాలర్లకు; చమురేతర దిగుమతులు 2.82% హెచ్చి 366.97 బి. డాలర్లకు చేరుకున్నాయి.

views: 760

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams