Current Affairs Telugu Daily

తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తి గా జస్టిస్‌ శ్రీదేవి 
ప్రస్తుతం అలహాబాద్‌ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ శ్రీదేవిని తెలంగాణ హైకోర్టుకు బదిలీ నిమిత్తం సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
2005లో జ్యుడీషియల్‌ సర్వీసులో చేరిన ఆమె 2016లో జిల్లా సెషన్స్‌ జడ్జిగా , ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో న్యాయమూర్తిగా సేవలందించారు.
గాజియాబాద్‌ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జిగానూ పనిచేశారు. అనంతరం 2017లో యూపీ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 నవంబరు 22న అలహాబాద్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
కొలీజియం:
  • సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామక విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి, నలుగురు ఇతర సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తుల సలహాను తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీల విషయంలో ఇద్దరు సీనియర్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సలహాను తప్పనిసరిగా పాటించాలి. దీనినే కొలీజియం వ్యవస్థగా పరిగణించారు.
  • 1993లో(రెండో జడ్జస్‌ కేసు) సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్స్‌ అసోసియేషన్‌, యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో జస్టిస్‌ జె.ఎస్‌. వర్మ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యులు ఉన్న ధర్మాసనం మొదటిసారిగా కొలీజియం వ్యవస్థ గురించి పేర్కొంది.
  • భారత ప్రధాన న్యాయమూర్తి, నలుగురు ఇతర సీనియర్‌ న్యాయమూర్తుల సూచనలను కూడా తీసుకుని, తన సూచనలు జోడించి తుది నిర్ణయాలను భారత ప్రభుత్వానికి రాతపూర్వకంగా అందించాలి.
  • న్యాయమూర్తుల నియామకం, బదిలీల విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి స్వతంత్రంగా వ్యక్తిగత సామర్థ్యాలకు అనుగుణంగా వ్యవహరించాడానికి వీలు లేదు. అతను తప్పనిసరిగా కొలీజియం వ్యవస్థలోని ఇతర నలుగురు న్యాయమూర్తుల సలహాను కూడా పాటించాలి.
  • సంప్రదింపుల ప్రక్రియలోని నిబంధనలను పాటించకుండా భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన సిఫార్సులకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు.
  • 1993 నుండి కొనసాగుతున్న కొలీజియం విధానాన్ని రద్దు చేస్తూ, కేంద్ర ప్రభుత్వం నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్‌మెంట్ కమిషన్ యాక్ట్ (ఎన్‌జెఎసి)ను 2015 ఏప్రిల్ 13న తీసుకువచ్చింది. భారత సర్వోన్నత న్యాయస్థానం ఈ కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని 2015 అక్టోబర్ 16న తీర్పు చెప్పడంతో గతంలో ఉన్న కొలీజియం వ్యవస్థ ప్రస్తుతం కొనసాగుతుంది.

views: 924

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams