Current Affairs Telugu Daily

2017-18 ఆడిట్‌ నివేదిక దాఖలుకు జీఎస్‌టీ నెట్‌వర్క్‌ పోర్టల్‌ సిద్ధం
జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన అనంతరం మొట్టమొదటి ఆర్థిక సంవత్సరమైన 2017-18కు ఆడిట్‌ నివేదికను జూన్‌ 30 కల్లా దాఖలు చేయుటకు వీలుగా జీఎస్‌టీ నెట్‌వర్క్‌ పోర్టల్‌లో ఓ ఫార్మాట్‌ను జీఎస్‌టీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది.
*రూ.2 కోట్లకు పైగా వార్షిక టర్నోవరు ఉన్న వ్యాపారులు 2017-18 ఆర్థిక సంవత్సరానికి జీఎస్‌టీ ఆడిట్‌ నివేదికలను దాఖలు చేయడం ప్రారంభించవచ్చు.
*ఆడిట్‌ నివేదికల నిమిత్తం జీఎస్‌టీఆర్‌-9, జీఎస్‌టీఆర్‌-9ఏ, జీఎస్‌టీఆర్‌-9సీ వార్షిక రిటర్న్‌ ఫారాలను 2018 డిసెంబరు 31న ప్రభుత్వం నోటిఫై చేసింది.
*జీఎస్‌టీఆర్‌-9ను జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ దాఖలు చేయాల్సి ఉంటుంది
*జీఎస్‌టీఆర్‌-9ఏ కాంపోజిషన్‌ చెల్లింపుదార్లు దాఖలు చేయాలి
*జీఎస్‌టీఆర్‌-9సీ అనేది కాస్ట్‌ అకౌంటెంట్‌ లేదా చార్టర్డ్‌ అకౌంటెంట్‌ పరిశీలించి, సంతకం చేసిన రీకాన్సిలేషన్‌ స్టేట్‌మెంట్‌.
*ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.2 కోట్లకు మించి టర్నోవరు ఉన్న పన్ను చెల్లింపుదారు దీనిని ఏటా సమర్పించాల్సి ఉంటుంది.
*జీఎస్‌టీ మండలి గత డిసెంబరులో  వీటి దాఖలు గడువు తేదీని మూడు నెలలు అంటే జూన్‌ 30వ తేదీ వరకు పొడిగించింది.
జీఎస్‌టీ మండలి:
  • కౌన్సిల్ సిఫార‌సుల్లో కేంద్రానికి 1/3 వంతు ఓటు, రాష్ట్రాల‌కు 2/3 వంతు ఓటు హ‌క్కు ఉంటుంది. తీర్మానానికి 3/4 వంతు మెజార్టీ అవ‌స‌రం.
  • జీఎస్టీలో కీల‌క‌మైన ప‌న్ను రేటును ఈ కౌన్సిలే నిర్ణ‌యిస్తుంది
  • జీఎస్‌టీ కౌన్సిల్ కు కేంద్ర ఆర్థిక మంత్రి చైర్మన్ గా వ్యవహరించనుండగా, రాష్ట్రాల ఆర్థికమంత్రులు సభ్యులుగా ఉంటారు
  • వస్తు సేవలపై పన్ను రేటు ఎంత ఉండాలి? మినహాయింపు ఉండే విభాగాలేంటి? పన్ను విధానం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం తదితర అంశాలపై నిర్ణయాలపై ఈ కౌన్సిల్ నిర్ణ‌య‌మే కీల‌కం
  • రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులు సంభవిస్తే అదనపు వనరుల సేకరణకు ప్రత్యేక రేట్లు నిర్ణయించడం మరియు సంబంధిత విషయాలపై నిబంధనలు నిర్ణయించే అధికారం కలదు 

views: 722Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams