Current Affairs Telugu Daily

ప్రపంచంలోనే తొలిసారిగా రూపొందించిన సాయుధ ఉభయచర డ్రోన్‌ పడవను విజయవంతంగా పరీక్షించిన చైనా
ప్రపంచంలోనే తొలిసారిగా రూపొందించిన సాయుధ ఉభయచర డ్రోన్‌ పడవను చైనా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని నీటితో పాటు నేల మీద జరిగే పోరాటాల్లోనూ  ఉపయోగించవచ్చని పరిశోధకులు తెలిపారు.
*‘మెరైన్‌ లిజర్డ్‌’ అనే ఈ డ్రోన్‌ పడవను వుచాంగ్‌ నౌకా నిర్మాణ సంస్థ రూపొందించింది. ఏకబిగిన 1200 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.
*దీన్ని ఉపగ్రహాల ద్వారా రిమోట్‌ సాయంతో నియంత్రించవచ్చు. దీని పొడవు 12 మీటర్లు. నీటిలో శత్రువు కంటపడకుండా సంచరిస్తూ గంటకు 50 నాట్‌ల వేగాన్ని అందుకోగలదు. నేల మీద గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
*ఇందులో ఎలక్ట్రో-ఆప్టికల్‌ వ్యవస్థ, రాడార్‌ ఉంటాయి. రెండు మెషీన్‌ గన్‌లు, నౌకలను ఉంచారు.
*ఈ పడవ విమానాలను విధ్వంసం చేసే క్షిపణులను ప్రయోగించగలదు. నీటిలో సొంతంగా మార్గనిర్దేశం చేసుకుంటూ అవరోధాలను అధిగమించగలదు.

views: 846

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams