Current Affairs Telugu Daily

ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు
సర్వోన్నత న్యాయస్థానంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేసి తీరాల్సిందేనని స్పష్టంచేస్తూ ప్రభుత్వ ఉద్యోగాల్లోని ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల అంశంలో దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల పై యథాతథ స్థితిని విధించింది.
*ఈ రిజర్వేషన్లు కల్పించాలన్న సుప్రీంకోర్టు తీర్పునకు మూడు నెలల్లోగా కట్టుబడాలని కేంద్రాన్ని దిల్లీ హైకోర్టు నవంబర్‌ 12న ఆదేశించింది.
*దిల్లీ హైకోర్టు ఉత్తర్వులను కేంద్రం సుప్రీంకోర్టులో సవాల్‌ చేయడంతో దీనిపై జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
*2006లోనే సుప్రీంకోర్టు పదోన్నతుల్లో రిజర్వేషన్లు సరికాదంటూ తీర్పునిచ్చింది
*ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలు అన్ని రకాలుగా రిజర్వేషన్లు పొందుతున్నారని, ఇప్పుడు పదోన్నతుల్లోనూ రిజర్వేషన్లు ఇవ్వాలని, ప్రైవేటు ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలని పలు డిమాండ్ లు వ్యక్తమవతున్నాయి.
  • నిభందన 16(4A) - ప్రభుత్వ ఉద్యోగ పదోన్నతుల్లో ప్రత్యేక రేజర్వేషన్లు(77వ రాజ్యాంగ సవరణ చట్టం - 1995)

views: 851

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams