Current Affairs Telugu Daily

ఇంటర్నెట్‌ వినియోగంలో భారత్‌ రికార్డు
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఇంటర్నెట్‌ వినియోగదారులున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. మెక్‌కిన్సీ సంస్థ నిర్వహించిన సర్వేలో అధిక జనాభా కలిగిన చైనా మొదటి స్థానంలో నిలిచింది.
*భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగదారులు సగటున వారానికి 17 గంటలు సామాజిక మాధ్యమాలతోనే గడుపుతున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఈ విషయంలో అమెరికా, చైనా కంటే భారత్‌ ముందుందని తెలిపింది. *భారత్‌లో ప్రస్తుతం 560 మిలియన్ల ఇంటర్నెట్‌ వినియోగదారులు ఉన్నారని, 2025 కల్లా ఆ సంఖ్య గణనీయంగా పెరగనున్నట్లు తెలిపింది.
*ప్రపంచ వ్యాప్తంగా వేగంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న దేశాల్లో ఇండొనేసియా తర్వాత భారత్‌ నిలిచింది. 

views: 922

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams