Current Affairs Telugu Daily

నిర్భ‌య్ క్షిప‌ణి ప‌రీక్ష విజ‌య‌వంతం
భార‌త్ స‌బ్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. ఒడిశా తీరం నుంచి నిర్భ‌య్ మిస్సైల్‌ను ప‌రీక్షించింది. వెయ్యి కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను ఇది చేధిస్తుంది.
*ధ్వ‌ని వేగం క‌న్నా త‌క్కువ వేగంతో ఈ క్షిప‌ణి ప్ర‌యాణిస్తుంది. బెంగుళూరుకు చెందిన ఏరోనాటిక‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌(ఏడీఈ) దీన్ని అభివృద్ధి చేసింది.
*నిర్భ‌య్ సుదూరం ప్ర‌యాణించే క్షిప‌ణి. అన్ని వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో దీన్ని ప్ర‌యోగించే వీలుంటుంది. ఎటువంటి ప్లాట్‌ఫార్మ్ నుంచి అయినా దీన్ని లాంచ్ చేయ‌వ‌చ్చు.
*నిర్భ‌య్‌ సాంప్ర‌దాయ అణ్వాయుధాల‌ను మోసుకెళ్ల‌గ‌ల‌దు. టేకాఫ్ కోసం రాకెట్ బూస్ట‌ర్‌ని వినియోగిస్తారు.ఎత్తుకు వెళ్లిన త‌ర్వాత  ట‌ర్బోఫ్యాన్ ఇంజిన్ ద్వారా ఇది టార్గెట్‌ను చేరుకుంటుంది.
*రీస‌ర్చ్ సెంట‌ర్ ఇమార‌త్‌(ఆర్‌సీఐ) డెవ‌ల‌ప్ చేసిన నావిగేష‌న్ వ్య‌వ‌స్థ ద్వారా మిస్సైల్ దూసుకెళ్లుతుంది. ఎత్తును ప‌ర్య‌వేక్షించేందుకు రేడియో ఆల్టీమీట‌ర్‌ను వాడుతారు.

views: 916

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams