Current Affairs Telugu Daily

సిక్కు తీవ్రవాద ప్రస్తావన తొలగింపు:కెనడా ప్రభుత్వం
ఉగ్రవాదంపై రూపొందించిన నివేదికలో సిక్కు తీవ్రవాదం ప్రస్తావనను కెనడా ప్రభుత్వం తొలగించింది. దేశానికి పొంచి ఉన్న ఐదు ప్రధాన ఉగ్రవాద ముప్పుల్లో సిక్కు తీవ్రవాదం కూడా ఉందని తొలుత పేర్కొని, ఆ తర్వాత మార్చుకుంది. *మతం ప్రస్తావనను తొలగించడానికి నివేదికలోని అంశాలను మార్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాదంపై రూపొందిన ఈ నివేదికను తొలుత గత ఏడాది డిసెంబర్‌లో విడుదల చేశారు. దీనిపై సిక్కు వర్గం నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. సిక్కు ఉగ్రవాదాన్ని ఈ జాబితాలో చేర్చడం ఇదే మొదటిసారి.
*అందులో వాడిన పదజాలాన్ని మార్చాల్సిందిగా తాను కోరతానని కెనడా ప్రజా భద్రతా శాఖ మంత్రి రాల్ఫ్‌ గూడాలే చెప్పారు. మతాలను ఉగ్రవాదంతో ముడిపెట్టరాదన్నారు. ఆ మేరకు తాజాగా మార్పు జరిగింది.
*‘భారత్‌లోని స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసేందుకు హింసాత్మక విధానాలను సమర్థిస్తున్న అతివాదులు’గా ఆ ప్రస్తావనను మార్చినట్లు నివేదిక పేర్కొంది.

views: 765



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams