Current Affairs Telugu Daily

మడగాస్కర్‌లో తట్టు (మీజిల్స్‌) వ్యాధి తొ 1200 మందికిపైగా చనిపోయారు
మడగాస్కర్‌లో తట్టు (మీజిల్స్‌) వ్యాధి తో 1200 మందికిపైగా చనిపోయారు. చరిత్రలో మునుపెన్నడూ లేనంతటి భారీస్థాయిలో మడగాస్కర్‌లో తట్టు వ్యాపించింది.
ఇప్పటికే నమోదైన కేసుల సంఖ్య 1.15 లక్షలు దాటింది. చిన్నారులకు నిరోధక టీకాల కార్యక్రమంగా అంతగా ప్రభావం చూపడం లేదు. మడగాస్కర్‌లో కేవలం 58 శాతం మంది మాత్రమే తట్టు నివారణ టీకా వేయించుకున్నారు. 
ప్రధాన కారణంః
అత్యంత సాంక్రమిక వ్యాధిగా పేరొందిన తట్టు వ్యాప్తిని అడ్డుకునేందుకు 90 నుంచి 95 శాతం వరకూ ఇమ్యూనైజేషన్‌ జరగాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పోషకాహార లోపమూ ఒక కారణంగా నిలుస్తోంది. తట్టు కేసులు అమెరికాతోపాటు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో పెరుగుతున్నాయి.
కీలకమైన టీకాల విషయంలో అపోహల కారణంగా చాలామంది తల్లిదండ్రులు వీటిని వేయించడానికి ఇష్టపడకపోవడంతో వ్యాధి అంతకంతకూ ప్రబలుతోంది. 

views: 769

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams