Current Affairs Telugu Daily

ప్రపంచంలోనే అతిపెద్ద విమానంగా స్ట్రాటోలాంచ్‌

ప్రపంచంలోనే అతిపెద్ద విమానంగా పేరుగాంచిన స్ట్రాటోలాంచ్‌ ప్రయోగాత్మక పరీక్షల్లో భాగంగా ఏప్రిల్ 13న తొలిసారి ఎగిరింది.
*2,26,800 కేజీల బరువున్న ఈ విమానం రెక్కల పొడవు ఏకంగా 117మీటర్లు అంటే దాదాపు ఫుట్‌బాల్ గ్రౌండ్‌ పొడవుతో సమానం. కాలిఫోర్నియా ఎడారి ప్రాంతంలో ఉండే మోజావే విమానాశ్రయం నుంచి తొలి టేకాఫ్ తీసుకుంది.
*గంటకు 304కి.మీ వేగంతో ఎగిరిన ఈ విమానం దాదాపు 17వేల అడుగుల ఎత్తులో ప్రయాణించింది. స్ట్రాటోలాంచ్ అనే కంపెనీ దీనిని తయారుచేసింది.
*మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు దివంగత పాల్ అలెన్ 2011లో ఈ కంపెనీని స్థాపించారు. 
*​​​​​​గాలిలో నుంచి నేరుగా రాకెట్లను ప్రయోగించి తద్వారా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాలన్నది ఈ విమానం తయారీ వెనక ముఖ్య ఉద్దేశం.
*ఆరు ఇంజిన్లు, రెండు విమాన బాడీలు (డ్యూయల్ ఫ్యూజ్‌లాజ్) కలిగిన ఈ విమానం గరిష్ఠంగా 35 వేల అడుగుల ఎత్తులో ఎగిరేలా రూపొందించారు.
*ఈ విమానం విజయవంతంగా టేకాఫ్ కావడంతో ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత బరువైన విమానం టేకాఫ్ అయిన రికార్డును సొంతం చేసుకుంది.


views: 917

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams