Current Affairs Telugu Daily

బ్రిటిష్‌ సైనికాధికారి జనరల్‌ డయ్యర్‌కు విరాళాలు
భారత చరిత్రలో పెనువిషాదంగా మిగిలిపోయిన జలియన్‌వాలా బాగ్‌ మారణకాండకు తెగబడిన నాటి బ్రిటిష్‌ సైనికాధికారి జనరల్‌ డయ్యర్‌ కోసం అప్పట్లో ‘మార్నింగ్‌ పోస్ట్‌’ వార్తాపత్రిక పనిగట్టుకుని నిధులు సేకరించింది.
*ఆ రోజుల్లో 26 వేల పౌండ్లు విరాళాల రూపంలో అందాయి. ప్రఖ్యాత రచయిత రుడ్‌యాడ్‌ కిప్లింగ్‌ పదిపౌండ్లను విరాళంగా ఇచ్చినట్లు ‘జలియన్‌ వాలాబాగ్‌’ పుస్తకం వెల్లడించింది.
*డయ్యర్‌ను బ్రిటిష్‌ అధికారులు 1920లో ఆ పదవి నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో జనరల్‌ డయ్యర్‌  విశ్రాంత జీవితం ప్రశాంతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ బ్రిటిష్‌ వార్తా పత్రిక ‘మార్నింగ్‌పోస్ట్‌’ నిధుల సేకరణ తలపెట్టింది.

views: 893



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams