Current Affairs Telugu Daily

సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌కు అంతర్జాతీయ పురస్కారం
సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌కు బ్రిటన్‌కు చెందిన అచీవ్‌మెంట్‌ ఫోరం ఈ ఏడాదికి ‘మేనేజర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు’ను అందించింది.
*లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ప్రాంగణంలో జరిగిన ఎచీవ్‌మెంట్‌ ఫోరం-2019 కార్యక్రమంలో గ్లోబల్‌ క్లబ్‌ లీడర్స్‌ సంస్థ అధ్యక్షుడు క్రిన్టినా బ్రిగ్స్‌, యూరోప్‌ బిజినెస్‌ అలయన్స్‌ ప్రతినిధి జాన్‌ నెటింగ్‌ల చేతుల మీదుగా శ్రీధర్‌ ఈ అవార్డుతో పాటు జ్ఙాపికను కూడా అందుకున్నారు.
*సింగరేణి సంస్థ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రతిభను చాటుతోందని, వినూత్న సృజనాత్మక ఆలోచనలు, అసాధారణ నాయకత్వం, వ్యాపార నియామకాలను త్రికరణ శుద్ధితో పాటిస్తూ ముందుకు పోతోందని, సామాజిక బాధ్యత కార్యక్రమాల్లోనూ ఉత్తమ సేవలందిస్తోందని గుర్తించి ఈ పురస్కారం అందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

views: 921



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams