Current Affairs Telugu Daily

జలియన్‌ వాలాబాగ్‌ దురాగతానికి వందేళ్లు
1919, ఏప్రిల్ 13న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌ సమీపంలో గల స్వర్ణ దేవాలయం పక్కనే ఉన్న జలియన్ వాలాబాగ్ లో బ్రిటీష్‌ సైన్యం కాల్పులు జరిపింది.
* భారతీయుల హక్కులను కాలరాస్తూ బ్రిటీష్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా సమావేశమైన వేలమందిపై తూటల వర్షం కురించారు.
*ఈ ఘటనకు నేటితో వందేళ్లు పూర్తియిన సందర్భంగా అమృత్‌సర్‌లోని అమరుల స్మారక స్థూపం వద్ద  రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు.
  • భారతీయు ఒత్తిడిమేరకు ఈ ఉదంతంపై విచారణ జరపడానికి బ్రిటీష్‌ ప్రభుత్వం 1919లో "హంటర్ కమిషన్" ఏర్పాటు చేశారు
  • 1920లో ఈ దుర్ఘటన జరిగిన స్థలంలో ఒక స్మారక స్తూపాన్ని నిర్మించడానికి భారత జాతీయ కాంగ్రెస్(ఐఎన్‌సీ) తీర్మానించింది. 
  • అమెరికాకు చెందిన బెంజమిన్ పోల్క్ అనే ఆర్కిటెక్టు స్మారక స్తూపానికి రూపకల్పన చేశాడు.
  • 1961 ఏప్రిల్ 13న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్, జవహర్ లాల్ నెహ్రూ వంటి నాయకుల సమక్షంలో ఈ స్తూపం ఆవిష్కరింపబడింది. 

views: 872

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams