Current Affairs Telugu Daily

ఏపీ పునర్విభజన చట్టంపై కేంద్రం హోంశాఖ ప్రత్యేక సమావేశం 
విభజన చట్టంతో సంబంధం ఉన్న అన్ని శాఖల అధికారులతో కేంద్రం హోంశాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది.
*ఏపీ పునర్విభజన చట్టంపై కేంద్రం హోంశాఖ ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సమావేశంకు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్పాల్‌ చౌహాన్‌ నేతృత్వం వహించారు. 
*విభజన చట్టంలోని 13 షెడ్యూల్‌ అమలుపై ప్రత్యేకంగా  ఈ సమావేశంలో చర్చించారు.
*దీనితో పాటుగా విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలపైనా ఈ భేటీలో చర్చించారు.
*ఏపీ నుంచి ఐఏఎస్‌ అధికారులు నీరబ్‌కుమార్‌, కరికాల వలవన్‌తో పాటు తెలంగాణ నుంచి రామకృష్ణారావు లాంటి వారు హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం - 2014ః
షెడ్యూల్ 13 (సెక్షన్ 93): 
  • ఉన్నత విద్య మరియు మౌలిక సదుపాయాల కల్పన 
పార్ట్ X: మౌళిక సదుపాయాలు,ప్రత్యేక ఆర్థిక చర్యలు(సెక్షన్స్‌ 92: 94)
  • సెక్షన్ 92: కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మూలసూత్రాలు,మార్గదర్శకాలు మొదలగు వాటిని కొత్తగా ఏర్పడే రాష్ట్రాలు అనుసరించాలి
  • సెక్షన్ 93: కొత్తగా ఏర్పడే రాష్ట్రాల ప్రగతి, అభివృద్ధి కోసం చర్యలు
  • సెక్షన్ 94: పన్ను ప్రోత్సాహకాలతో సహా ఆర్థిక చర్యలు
  • 94(1).రెండు రాష్ట్రాలలోనూ పారిశ్రామికీకరణను ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి ఏర్పడే రాష్ట్రాలకు పన్ను ప్రోత్సాహాకాలతో సహా తగు విధమైన ఆర్థిక చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకొనవలెను
  • 94(2).భౌతిక,సాంఘిక పరమైన మౌళిక వనరులు విస్తరణతో సహా ఏర్పడే రాష్ట్రాలలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికై చేపట్టే కార్యక్రమాలకు కేంద్రం సహాయం చేయాలి
  • 94(3).రాజ్ భవన్,హైకోర్టు,ప్రభుత్వ సచివాల యం,శాసనసభ,శాసనమండలి,అవసరమైన ఇతర మౌళిక సదుపాయాలతో సహా కొత్తగా ఏర్ప డే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధానిలో అవసర మైన సౌకర్యాల ఏర్పాటు కోసం కేంద్రప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలి
  • 94(4). కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమని భావిస్తే శిథిలమైన అటవీ ప్రాంతాన్ని డీనోటిఫై చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కొత్త రాజధాని ఏర్పాటు చేయడానికి విలుకల్పించారు

views: 1168

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams