Current Affairs Telugu Daily

ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత అవార్డు

భారత ప్రధాని నరేంద్ర మోదీని రష్యా ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది. ‘ ఆర్డర్‌ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్య్రూ ది అపోస్టల్‌’ అనే రష్యా అత్యున్నత పౌర అవార్డుతో సత్కరించింది. రష్యా భారత్‌ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య నిర్మాణం కోసం మోడీ కృషి చేసినందుకు గాను ఈ అవార్డును రష్యా ప్రకటించింది.
*మోదీకి అంతర్జాతీయ అవార్డు రావడం ఈ నెలలో ఇది రెండోసారి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం కూడా తమ దేశ అత్యున్నత పౌర అవార్డు ‘ జయేద్‌ మెడల్‌’ను మోదీకి ఇచ్చింది . ఇరు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాలను బలపరచడానికి మోదీ చేసిన ప్రయత్నాలకు గుర్తింపుగా ఆ దేశం ఈ అవార్డును ప్రకటించింది. 

  • Russia Capital: Moscow
  • Currency: Russian ruble
  • President: Vladimir Putin

views: 974



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams