Current Affairs Telugu Daily

ఏడుగురు భారతీయులకు ప్రతిష్ఠాత్మక ‘గేట్స్‌ కేంబ్రిడ్జ్‌ స్కాలర్‌షిప్‌’
అత్యంత ప్రతిష్ఠాత్మక ‘గేట్స్‌ కేంబ్రిడ్జ్‌ స్కాలర్‌షిప్‌-2019’ కు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఎంపికైన 90 మంది పోస్టుగ్రాడ్యుయేట్‌లలో ఏడుగురు భారతీయులున్నారు.
*వీరు ఆయా సబ్జెక్టులలో కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తారు.  ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన అత్యంత ప్రతిభాశీలురైన ఏడుగురు భారతీయుల్లో నికిత ముమ్మిడివరపు( హిస్టరీ, ఫిలాసఫీ) ధృవ్‌ నందమూడి (బయాలాజికల్‌ సైన్సెస్‌)లున్నారు.
*వీరితో పాటూ అర్జున్‌ అశోక(జెండర్‌ స్టడీస్‌), కనుప్రియాశర్మ(క్రిమినాలజీ), రితికా సుబ్రమణియన్‌ (జెండర్‌స్టడీస్‌), అవని వీయిరా(ఆంగ్లం), నిషాంత్‌ గోఖలే(లీగల్‌ స్టడీస్‌)లున్నారు.
*గేట్స్‌ కేంబ్రిడ్జ్‌ స్కాలర్లంటేనే అత్యంత అరుదైన నైపుణ్యాలు కలిగిన ప్రతిభావంతులని కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం ప్రశంసించింది.

views: 847



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams