Current Affairs Telugu Daily

నైపుణ్యం కల ఉద్యోగులను ఆకర్షించటంలో దేశంలో మొదటి మూడు నగరాల్లో హైదరాబాద్‌
నైపుణ్యం కల ఉద్యోగులను ఆకర్షించటంలో దేశంలో మొదటి మూడు నగరాల్లో హైదరాబాద్‌ స్థానం దక్కించుకుంది. ఈ విషయంలో ప్రధమ, ద్వితీయ  స్థానాల్లో ఎన్‌సీఆర్‌ (దేశ రాజధాని దిల్లీ ప్రాంతం), బెంగుళూరు ఉండగా, హైదరాబాద్‌ మూడోస్థానంలో నిలిచింది.
*అతిపెద్ద ‘ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌’ అయిన ‘లింక్డ్‌ఇన్‌’ 2018-19 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థానికి రూపొందించిన ‘భారత ఉద్యోగస్థుల నివేదిక’ ఈ వివరాలు వెల్లడించింది. కొత్తగా ఏఏ రంగాల్లో ఉద్యోగాలు అధికంగా వస్తున్నాయి, ఎటువంటి నిపుణులకు గిరాకీ ఉంది, దేశంలోని ఏఏ నగరాలు సమర్థులైన ఉద్యోగులను ఆకర్షించగలుగుతున్నాయి అనే విశేషాలతో ఈ నివేదికను లింక్డ్‌ఇన్‌ రూపొందించింది.
*ప్రపంచ వ్యాప్తంగా యువ జనాభా, యువ ఉద్యోగులు అత్యధిక సంఖ్యలో ఉన్న దేశం భారతదేశమేనని, అందువల్ల ఉద్యోగాలు, ఉద్యోగస్తుల తీరుతెన్నులను ప్రతిబింబిస్తూ ఈ నివేదిక రూపొందించినట్లు లింక్డ్‌ఇన్‌ ఇండియా కంట్రీ మేనేజర్‌ మహేష్‌ నారాయణన్‌ అన్నారు. 

నిపుణులను ఆకర్షించటంలో ముందున్న నగరాలుః

  • ఎన్‌సీఆర్‌; బెంగళూరు; హైదరాబాద్‌;ముంబయి; చెన్నై; కోల్‌కతా; అహ్మదాబాద్‌;చండీగఢ్‌; వడోదర; జయపుర

views: 996

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams